అనకాపల్లి జిల్లాలో గంజాయి స్మగ్లర్లపై ఉక్కుపాదం……..
PIT NDPS చట్టం కింద పాత నేరస్తులు రిమాండ్……..
నాతవరం నవంబర్ 15అఖండ భూమి న్యూస్
*అనకాపల్లి (నర్సీపట్నం రూరల్ సర్కిల్ ), నవంబర్ 15:* గంజాయి సాగు, అక్రమ రవాణా, విక్రయాలను సమూలంగా నిర్మూలించడమే లక్ష్యంగా అనకాపల్లి జిల్లా ఎస్పీ శ్రీ తుహిన్ సిన్హా, ఐపీఎస్ ఆదేశాల మేరకు పోలీసులు కఠిన చర్యలు చేపట్టారు. నర్సీపట్నం డీఎస్పీ శ్రీ పి.శ్రీనివాసరావు పర్యవేక్షణలో వరుస నేరాలకు పాల్పడుతున్న ఒక అంతర్రాష్ట్ర గంజాయి స్మగ్లర్‌పై PIT NDPS చట్టం (Prevention of Illicit Traffic in Narcotic Drugs and Psychotropic Substances Act, 1988) కింద డిటెన్షన్ ఉత్తర్వులు అమలు చేశారు.
*నిందితుల వివరాలు – నేర చరిత్ర:*
1.నర్సీపట్నం మండలం, నీలంపేట గ్రామానికి చెందిన *రుత్తల బోడకొండ @నాని,* తండ్రి: నూకరాజు, అలవాటుపడ్డ నేరస్థుడిగా (Habitual Offender) గుర్తించబడ్డాడు. ఇతను అల్లూరి సీతారామరాజు జిల్లా ఏజెన్సీ ప్రాంతాల నుంచి విశాఖపట్నం, విజయవాడ, హైదరాబాద్ తదితర ప్రాంతాలకు భారీ ఎత్తున అక్రమంగా గంజాయిని తరలిస్తున్నాడు. *ఇతనిపై గతంలో పలు పోలీస్ స్టేషన్లలో 6 గంజాయి కేసులు నమోదయ్యాయి:*
*అన్నవరం పోలీస్ స్టేషన్* – 01 కేసు(200 kgs గంజాయి )
*తుని రూరల్ పోలీస్ స్టేషన్* – 01 కేసు (76 kgs గంజాయి )
*రాజానగరం పోలీస్ స్టేషన్* – 01 కేసు(402.6 kgs గంజాయి ) , *నర్సీపట్నం రూరల్ పోలీస్ స్టేషన్* లో -01 కేసు (400 kgs గంజాయి ), *యలమంచిలి రూరల్ పోలీస్ స్టేషన్* – 01 కేసు ,(390 kgs గంజాయి ), *నాతవరం పోలీస్ స్టేషన్* – 01 కేసు(122 kgs గంజాయి ) లలో
*2. గొలుగొండ మండలం, చీడిగుమ్మల పోలవరం గ్రామానికి చెందిన కొప్పి సత్తిబాబు,* తండ్రి: చిన్న రాజుబాబు , అలవాటుపడ్డ నేరస్థుడిగా (Habitual Offender) గుర్తించబడ్డాడు.ఇతనిపై గతంలో పలు పోలీస్ స్టేషన్లలో 3 గంజాయి కేసులు
*మాకవరపాలెం పోలీస్ స్టేషన్* లో – 01 (120kgs గంజాయి ), *పటమట పోలీస్ స్టేషన్ లో* – 01( 16 kgs గంజాయి ), *బొమ్మూరు పోలీస్ స్టేషన్* లో -01 (170 kgs గంజాయి).
*3.మాకవరపాలెం మండలం, పెద్దిపాలెం గ్రామానికి చెందిన పైలా సురేష్ ,* తండ్రి: రామ మూర్తి , అలవాటుపడ్డ నేరస్థుడిగా (Habitual Offender) గుర్తించబడ్డాడు. ఇతనిపై గతంలో *మాకవరపాలెం పోలీస్ స్టేషన్లలో* 02 గంజాయి కేసులు నమోదయ్యాయి (ఒక కేసులో 2,160 kgs గంజాయి మరొక కేసులో -120 kgs గంజాయి )
ఫై తెలిపిన ముగ్గురు వ్యక్తులు గతంలో అరెస్ట్ అయి జైలుకు వెళ్లినప్పటికీ నిందితుల ప్రవర్తనలో మార్పు రాలేదు. నిరంతరం గంజాయి అక్రమ రవాణాకు పాల్పడుతూ సమాజ శాంతిభద్రతలకు, యువత భవిష్యత్తుకు ముప్పుగా మారడంతో జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ఇతనిపై PIT NDPS చట్టం కింద ముందస్తు నిర్బంధ (Preventive Detention) ఉత్తర్వులు జారీ అయ్యాయి.
*అరెస్ట్ – జైలుకు తరలింపు:*
నర్సీపట్నం రూరల్ సీఐ ఎల్.రేవతమ్మ, NDPS సెల్ ఇన్స్పెక్టర్ పిల్లా రమేష్,
నాతవరం ఎస్సై వై.తారకేశ్వరరావు, మాకవరపాలెం ఎస్సై పి.దామోదర్ నాయుడు మరియు సిబ్బంది పకడ్బందీ ఆపరేషన్ నిర్వహించి వేరు వేరు కేసులలో నిందితులుని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారిని విశాఖపట్నం సెంట్రల్ జైలుకు తరలించారు.
*జిల్లా ఎస్పీ శ్రీ తుహిన్ సిన్హా, ఐపీఎస్ హెచ్చరిక:*
”జిల్లాలో గంజాయి దందాలకు పాల్పడే వారిపై నిరంతర నిఘా కొనసాగుతోంది. గంజాయి సాగు చేసినా, నిల్వ ఉంచినా, కొనుగోలు చేసినా లేదా రవాణా చేసినా ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదు. పదేపదే ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై PIT NDPS చట్టం మరియు పీడీ యాక్ట్ వంటి అత్యంత కఠినమైన చట్టాలను ప్రయోగిస్తాం.”
You may also like
రైతుల పంటల సరపరలో విఫలమైన కాంగ్రెస్ ప్రభుత్వం…
యశోద ఆసుపత్రిలో అరుదైన శాస్త్ర చికిత్స ప్రతి సెకను ఎంతో విలువైనది…
న్యూరో ఇండోస్కోపీ, రోబోటిక్స్, అధునాతన ఇన్వసివ్ బ్రెయిన్ వెన్న ముఖ సంరక్షణ…
అల్లిపూడి ఎస్సీ కాలనీ అభివృద్ధికి ఎమ్మెల్యే యనమల దివ్య గారి బాటలు… ధన్యవాదాలు తెలిపిన టిడిపి మహిళా కార్యకర్త కొండ్రు రవణమ్మ
ఆంధ్రప్రదేశ్ లో అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ అమలు చేసి న్యాయవాదులకు రక్షణ కల్పించాలి. న్యాయవాది కొండ్రు కళ్యాణ్.



