పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో కాంగ్రెస్–బీఆర్ఎస్ వర్గాల ఘర్షణ

పోలీస్‌స్టేషన్‌లో పరస్పర ఫిర్యాదులు.. కమిషనర్ మౌనంవహించుటపై బీఆర్ఎస్ నేతల ప్రశ్నలు*
బెల్లంపల్లి నవంబర్,19(అఖండ భూమి న్యూస్):బెల్లంపల్లి పట్టణంలో బుధవారం శ్రీ కన్యక పరమేశ్వర ఫంక్షన్ హాల్లో నిర్వహించిన చేయూత పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో కాంగ్రెస్,బీఆర్ఎస్ వర్గాల మధ్య ఘర్షణకు దారితీసింది.ఇరువర్గాల మధ్య చోటుచేసుకున్న వాగ్వాదంతో కార్యక్రమ ప్రాంగణంలో కొద్దిసేపు ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఎమ్మెల్యే గడ్డం వినోద్,అదనపు కలెక్టర్ చంద్రయ్య,మున్సిపల్ చైర్‌పర్సన్ దావా స్వాతి లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేస్తున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకోవడం గర్వనార్ధం. 19వ వార్డుకు చెందిన బీఆర్ఎస్ కౌన్సిలర్ షేక్ సిమ్రాన్,ఆమె భర్త కలీం,వార్డు మహిళా ఆఫీసర్‌తో పాటు కాంగ్రెస్ వార్డు ఇన్‌చార్జి కాంపల్లి శ్రీనివాస్ సోదరుడు సతీష్ మధ్య ఫొటోలు,కార్డుల పంపిణీ విషయంలో వివాదం తలెత్తినట్లు సమాచారం.ఈ క్రమంలో మాటామాటా పెరిగి ఇరువర్గాల మధ్య ఘర్షణకు దారితీసింది.దీంతో కార్యక్రమంలో కొద్దిసేపు గందరగోళం నెలకొంది. నాయకులు ఇరువర్గాలను సముదాయించగా,పోలీసులు అక్కడికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు.అనంతరం ఇరువర్గాలు బెల్లంపల్లి వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌లో పరస్పరం ఫిర్యాదులు చేసుకున్నాయి. మున్సిపల్ చైర్‌పర్సన్ దావా స్వాతి రమేష్,కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు బండి ప్రభాకర్‌తో పాటు బీఆర్ఎస్ మద్దతుదారులు పోలీస్‌స్టేషన్‌కు చేరుకున్నారు.
*కమిషనర్ మౌనంపై ప్రశ్నలు*
ప్రభుత్వ మహిళా ఉద్యోగి,టీపీవో సెక్షన్ అధికారిగా విధులు నిర్వహిస్తున్న వార్డు ఆఫీసర్‌తో వాగ్వాదం జరిగిన నేపథ్యంలో మున్సిపల్ కమిషనర్ ఎందుకు ఫిర్యాదు చేయలేదని బీఆర్ఎస్ నాయకులు ప్రశ్నిస్తున్నారు.కమిషనర్ మౌనం వెనుక అధికార పార్టీ ఒత్తిడి ఉందా?అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.వార్డు మహిళా అధికారితో జరిగిన వివాదం అనంతరమే ఇరుపార్టీల నాయకుల మధ్య ఘర్షణ చోటుచేసుకున్నట్లు వీడియోల్లో కనిపిస్తోందని ఆరోపిస్తున్నారు.ఈ ఘటనపై పోలీసులు సమగ్ర విచారణ జరిపి,గొడవకు కారణమైన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.ఇరువర్గాల ఫిర్యాదుల మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పోలీసుల విచారణలో ఘర్షణకు గల పూర్తి కారణాలు వెల్లడికావాల్సి ఉంది…
You may also like
అనకాపల్లి జిల్లాలో గంజాయి స్మగ్లర్లపై ఉక్కుపాదం……..
రైతుల పంటల సరపరలో విఫలమైన కాంగ్రెస్ ప్రభుత్వం…
యశోద ఆసుపత్రిలో అరుదైన శాస్త్ర చికిత్స ప్రతి సెకను ఎంతో విలువైనది…
న్యూరో ఇండోస్కోపీ, రోబోటిక్స్, అధునాతన ఇన్వసివ్ బ్రెయిన్ వెన్న ముఖ సంరక్షణ…
అల్లిపూడి ఎస్సీ కాలనీ అభివృద్ధికి ఎమ్మెల్యే యనమల దివ్య గారి బాటలు… ధన్యవాదాలు తెలిపిన టిడిపి మహిళా కార్యకర్త కొండ్రు రవణమ్మ


