తెలంగాణ దశాబ్ది ఉత్సవాల పేరుతో బి.అర్. యస్ ప్రభుత్వం ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేస్తుంది
టిపిసిసి జనరల్ సెక్రెటరీ ఎడవల్లి కృష్ణ
భద్రాద్రి కొత్తగూడెం( జూన్ 22 అఖండ భూమి)
కొత్తగూడెం నియోజకవర్గం పట్టణ పరిధిలో గల రైల్వే స్టేషన్ నుండి మొదలై యం.జి రోడ్డు మీదుగా ఆర్డీవో ఆఫీస్ వరకు టిపిసిసి జనరల్ సెక్రెటరీ ఎడవల్లి కృష్ణ అధ్వర్యంలో భారీ ర్యాలీతో నిరసన వ్యక్తం చేయడం జరిగింది.
తెలంగాణ దశాబ్ది ఉత్సవాల పేరుతో బి.ఆర్.ఎస్ ప్రభుత్వం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడంతో పాటు ఉత్సవాల పేరుతో తెలంగాణ ప్రజానీకాన్ని మరోసారి మోసం చేస్తున్న ఈ బి.ఆర్.ఎస్ ప్రభుత్వంపై నిరసన కార్యక్రమాలు చేపట్టాలని టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి ఇచ్చిన పిలుపుమేరకు భారీ జన సందోహంతో బస్టాండ్ సెంటర్ రైటర్ బస్తి నందు జిల్లా కాంగ్రెస్ కార్యాలయం ముందు కేసీఆర్ 10 తలల రావణాసురుడు దిష్టిబొమ్మ దహనం చేశారు.తదుపరి ఆర్డీవో ఆఫీస్ వరకు భారీ ర్యాలీతో నిరసన వ్యక్తం చేశారు. అనంతరం ఆర్డిఓ ఆఫీస్ ఇంచార్జ్ కి వినతి పత్రం అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమములో ఎడవల్లి కృష్ణ మాట్లాడుతూ కేసీఆర్ చెప్పింది ఒకటి చేసేది ఒకటి ఇచ్చిన ఒక్క మాట కూడా నిలబెట్టుకొని చాతకని ముఖ్యమంత్రి కెసిఆర్ దగ దశాబ్ది వేడుకల పేరిట ప్రజల ధనాన్ని దుర్వినియోగం చేయడానికి నీవు ఎవరని,రాష్ర్టంలో ప్రజలు అనేక ఇబ్బందులతో బాధ పడుతుంటే ఇంకా ప్రజలను దగ మాటలతో మోసం చేస్తూనే ఉన్నాడని, ఇచ్చిన ఒక్క హామీ నిలబెట్టుకున్నావాఈ సందర్భంగా కేసీఆర్ ని ప్రశ్నించారు. నువ్విచ్చిన హామీలైన
1. కేజీ నుంచి పీజీ ఉచిత నిర్బంధ విద్య.
2.ఫీజ్ రీయంబర్స్ మెంట్.
3.ఇంటికో ఉద్యోగం.
4. నిరుద్యోగ భృతి.
5.పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు.
6.దళిత కుటుంబాలకు మూడు ఎకరాల భూమి.
7.పోడు భూములకు పట్టాలు
8. రైతు రుణ మాఫీ
9. 12 శాతం ముస్లిం రిజర్వేషన్లు.
10. 12 శాతం గిరిజన రిజర్వేషన్లు వీటిలో ఒక్క హామీ అయిన నెరవేర్చవా ? అన్ని మోసపూరిత హామీలే అని కేసీఆర్ ని బొంద పెట్టే రోజులు అతి దగ్గరలో ఉన్నాయని పేద బడుగు బలహీన వర్గాలకు, సామాన్య ప్రజలకు న్యాయం జరగాలంటే కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని ఇంకో అరు నెలలలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడం తధ్యంమని అన్నీ వర్గాల ప్రజలకు న్యాయం జరుగుతుందని టిపిసిసి జనరల్ సెక్రటరీ ఎడవల్లి కృష్ణ తెలిపారు. ఈ కార్యక్రమములో సీనియర్ కాంగ్రెస్ నాయకులు రాయల శాంతయ్య,కొత్తగూడెం పట్టణ అధ్యక్షులు బొమ్మిడి మల్లికార్జున్,పాల్వంచ పట్టణ అద్యక్షులు నూకల రంగారావు,లక్ష్మీదేవిపల్లి మండల అధ్యక్షులు సకినాల వెంకటేశ్వరావు,చుంచుపల్లి మండల అధ్యక్షులు అంతోటి పాల్,బీసీ సెల్ పట్టణ అధ్యక్షులు పల్లపు వెంకటేశ్వర్లు, ఐ.ఎన్ .టి యు. సి నాయకులు జెలిల్,త్యాగరాజన్,ఆల్బర్ట్, కాలం నాగభూషణం,సైమన్,పాల్వంచ మండల అద్యక్షులు కొండం వెంకన్న,పాల్వంచ మైనార్టీ పట్టణ అధ్యక్షులు చంద్ పాషా, ఎల్ డి ఎం అశ్వారావుపేట కో ఆర్డినేటర్ బద్ది కిషోర్,కొత్తగూడెం పట్టణ మైనార్టీ అద్యక్షులు మతిన్,సీనియర్ కాంగ్రెస్ నాయకులు చావా వీరయ్య చౌదరి,దన్ బాద్ సునీల్,సారంగా ఫణి,సుబ్బారెడ్డి,కలిపాక సత్యనారాయణ, ఫైజుద్దిన్, చంద్రగిరి సత్యనారాయణ,బత్తుల వెంకటేశ్వరరావు,కొత్తగూడెం పట్టణ మైనార్టీ అధ్యక్షురాలు జేరిన,యూత్ నాయకులు శనగ లక్ష్మణ్,జక్కుల శ్రీనివాస్,గడ్డిగుట్ట నరేష్,బట్టు గణేష్,కుషాల్,గురజాల సీతయ్య, పెద్దమల్లు నాగేశ్వరావు,అరిఫ్ పాషా,నిమ్మల గూడెం తుంపూరి వీరస్వామి, అంతోటి రాజు,మన్నే శ్రీనివాస్,రాముర్తి,పాత కొత్తగూడెం రాజు,మన్ సింగ్,సోషల్ మీడియా కో కో ఆర్డినేటర్ షఫీ,పాల్వంచ పట్టణ బీసీ సెల్ నాయకులు లోగాని మురళి,అనిశెట్టిపల్లి ఏరిశాల రమేష్,శ్రీకాంత్, ముక్కెర నాగేంద్ర,రామస్వామి,రేవంత్ యువ సేన అద్యక్షులు వనపాకుల రాంబాబు,మొద్దు శ్రీనివాస్,వెలేటి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.


