యువ శక్తిని మేల్కొల్పే దిశగా రాజీవ్ గాంధీ యూత్ అన్ లైన్ క్విజ్ కాంపిటేషన్ లో పాల్గొనండి

 

యువ శక్తిని మేల్కొల్పే దిశగా రాజీవ్ గాంధీ యూత్ అన్ లైన్ క్విజ్ కాంపిటేషన్ లో పాల్గొనండి

టిపిసిసి జనరల్ సెక్రెటరీ ఎడవల్లి కృష్ణ

భద్రాద్రి కొత్తగూడెం జూన్ 23 అఖండ భూమి వెబ్ న్యూస్ : కొత్తగూడెం నియోజకవర్గం లక్ష్మీదేవిపల్లి మండలం

సంచలనాత్మక హైదరాబాద్ యూత్ డిక్లరేషన్ స్ఫూర్తిగా తెలంగాణ యువశక్తిని మేల్కొల్పే దిశగా జూలై 2వ తేదీన నిర్వహించే రాజీవ్ గాంధీ యూత్ ఆన్ లైన్

క్విజ్ కాంపిటేషన్ కోసం యువతీ, యువకులు, విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని టిపిసిసి జనరల్ సెక్రటరీ ఎడవల్లి కృష్ణ తెలిపారు. శుక్రవారం లక్ష్మీదేవిపల్లి మండలంలోని కృష్ణవేణి, నలంద ఇంటర్ డిగ్రీ విద్యాసంస్థలలోని విద్యార్థులను కలుసుకుని రాజీవ్ గాంధీ యూత్ ఆన్ లైన్ క్విజ్ కాంపిటేషన్ కు సంబంధించి వివరాలను తెలియజేయడంతో పాటు దగ్గరుండి విద్యార్థులతో ఆన్లైన్ క్విజ్ రిజిస్ట్రేషన్ చేయించడం జరిగింది.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో యువత నిరుద్యోగంతో కొట్టమిట్టాడుతున్నారని దానిని దృష్టిలో పెట్టుకుని ఏఐసీసీ నాయకురాలు ప్రియాంకగాంధీ ఆధ్వర్యంలో యూత్‌ నిరుద్యోగ డిక్లరేషన్‌ విడుదల చేసినట్లు తెలిపారు. ఈ యూత్‌ ఆన్‌లైన్‌ క్విజ్‌ పోటీల్లో పాల్గొని గెలుపొందిన వారికి నియోజకవర్గం బహుమతులు అందజేస్తారని తెలిపారు. అత్యధికంగా యువకులు ఈ పోటీల్లో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ పోటీలు జూలై 2వ తేదీ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6గంటల వరకు ఆన్‌లైన్‌లో ఈ క్విజ్ పోటీ కొనసాగుతుందని తెలిపారు.జనరల్‌ నాలెడ్జ్‌ను మెరుగపరుచుకునేలా చేయడం, సాంప్రదాయక విద్యా విధానాల పరిధిని దాటి విభిన్నంగా ఆలో చింపచేయడం, భారతదేశ చరిత్ర, తెలంగాణ చర్రిత, తెలంగాణ ఉద్యమం వంటి వాటిపై అవగాహన కలిగి ఉండేలా ప్రోత్సహించడం కోసం క్విజ్‌ పోటీలను నిర్వహించనున్నట్లు తెలిపారు .ఈ కార్యక్రమములో చుంచుపల్లి మండల అధ్యక్షులు అంతోటి పాల్,లక్ష్మీదేవిపల్లి మండల యస్సీ సెల్ అధ్యక్షులు కొప్పుల రమేష్,పాల్వంచ మండల అధ్యక్షులు కొండం వెంకన్న గౌడ్,బత్తుల వెంకటేశ్వరరావు,కొత్తగూడెం నియోజకవర్గం సోషల్ మీడియా కో ఆర్డినేటర్ ఏలూరి రాజేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Akhand Bhoomi News

error: Content is protected !!