శివాలయంలో కార్తీక దీపా లు వెలిగించిన మహిళలు 
భక్తులను ఆకట్టుకున్న తీరు
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; నవంబర్ 5 (అఖండ భూమి న్యూస్);
కామారెడ్డి జిల్లా దోమకొండ మండల కేంద్రంలోని శివరాంమందిరి ఆలయంతో పాటు ,మార్కండేయ శివాలయంలో ఆలయ కమిటీ ప్రతినిధులు ప్రతి ఏటా కార్తీక్ పౌర్ణమి రోజు వందలాది దీపాలను వెలిగించి ఆలయాన్ని అలంకరించడం ఆనవాయితీగా వస్తుంది అందులో భాగంగా బుధవారం సాయంత్రం భక్తులు మహిళలు చిన్నలు, పెద్దలు అందరూ వేలాది భక్తులు నువ్వుల నూనెతో దీపాలను వెలిగించి ఆలయాన్ని అందంగా ముస్తాబు చేశారు. దీపాల అలంకరణ భక్తులను యువకులను విశేషంగా ఆకట్టుకుంది కార్తీక దీపాలు చూడడానికి వందలాది మంది భక్తులు ఆలయానికి చేరుకున్నారు. ఆలయానికి చేరుకున్న పలువురు కార్తీకదీపం వెలిగించిన భక్తులను ఆలయ కమిటీ ప్రతినిధులను ప్రశంసించారు.
You may also like
బీబీపేట్ నగరేశ్వర ఆలయంలో ఆకాశదీపం, జ్వాలా తోరణ కార్యక్రమం…
మాజీ ఎంపిటిసి కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ప్రభుత్వ విప్
ఏపీ పంచాయతీలో కీలక మార్పులు కార్యదర్శుల వర్గీకరణ ప్రమోషన్లు- జీవో జారీ..!
సెక్రటేరియట్లో సుదర్శన్ రెడ్డికి రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ శుభాకాంక్షలు*..l
నవీన్ యాదవ్ విజయమే ప్రజా ప్రభుత్వానికి దీవెనలు….


