ప్రచారంలో ముందంజ కాంగ్రెస్ అభ్యర్థి మెట్టు స్నేహ , మామిండ్ల రామ్ కిషోర్.
కామారెడ్డి 47 వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి మెట్టు స్నేహ..
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; ఫిబ్రవరి 4 (అఖండ భూమి న్యూస్);
కామారెడ్డి మున్సిపల్ పురపోరు ఎన్నికలలో 47 వ వార్డు కౌన్సిలర్ గా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నెట్టు స్నేహ, మామిండ్ల రామ్ కిషోర్ లు బుధవారం ఇంటింటి ప్రచారం చేస్తూ చేతి గుర్తుపై ఓటు వేయాలని అభ్యర్థించారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండడంతో గెలుపు గుర్రాలకు టికెట్లు కేటాయించినట్లు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీలో నిలిచినట్లు తెలిపారు. 47 వ వార్డు మోడల్ వార్డ్ గా అభివృద్ధి చెందాలంటే అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తుపై ఓటు వేసి భారీ విజయం సాధించే విధంగా వార్డు ప్రజలను అభ్యర్థించారు. మొత్తానికి బుధవారం ప్రారంభమైన ఎన్నికల ప్రచారంలో స్నేహ చురుకుగా పాల్గొని తన మద్దతుదారులతో ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, పట్టణ ప్రజలు పాల్గొన్నారు.
You may also like
కలెక్టరేట్ ప్రజావాణిలో 125 దరఖాస్తులు స్వీకరణ…
_పీఎం కిసాన్ డబ్బులు పడలేదా? ఈ నెంబర్కు కాల్ చేస్తే చాలు!_
కామారెడ్డిలో కాంగ్రెస్ పార్టీలో భారీ చేరికలు…
ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ ఐ ఆర్) 2026 ఓటరు జాబితా పై రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం…
25 న నిర్వహించనున్న నశా ముక్త్ భారత్ అభియాన్ ర్యాలీని విజయవంతం చేయాలి…


