ప్రజా సంఘాల ఆధ్వర్యంలో యుద్ధనౌక గద్దర్ మూడవ వర్ధంతి వేడుకలు

బెల్లంపల్లి అంబేద్కర్ చౌరస్తా(కాంటా చౌరస్తా)వద్ద గద్దర్ కు ఘన నివాళి
బెల్లంపల్లి ఆగస్టు 06(అఖండ భూమి న్యూస్):విప్లవ సంస్కృతిక యుద్ధనౌక గద్దర్ మూడో వర్ధంతి సందర్భంగా గురువారం ప్రజా సంఘాల నాయకులు అంబేద్కర్ చౌరస్తా (కాంటా చౌరస్తా)వద్ద గద్దర్ ఫ్లెక్సీ ఏర్పాటు చేసి ఘన నివాళి అర్పించారు,విప్లవోద్యమ యువతరానికి తన గళంతో స్ఫూర్తినిచ్చి ఉడుకునెత్తురును ఉద్యమానికి ధారబోయించిన గద్దర్ కు జోహార్లు అర్పించారు.తన గాంభీరమైన గలంతో తెలంగాణ ఉద్యమాన్ని వెన్ను తట్టి పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా పోరు తెలంగాణ మా అంటూ ఉత్తేజవంతంగా యువతరాన్ని కదిలించిన గద్దర్ ఆయన లేని లోటు సాంస్కృతిక ఉద్యమానికి తీర్చలేనిది అని వక్తలు కొనియాడారు.
ఈ కార్యక్రమంలో,తెలంగాణ సింగరేణి ఉద్యోగుల సంఘం గౌరవ అధ్యక్షులు నీరటి రాజన్న,టిఎన్టియుసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టీ.మనీ రామ్ సింగ్, గోదావరిలోయ బొగ్గు గని కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎండి.చాంద్ పాషా,శ్రామిక శక్తి గోదావరిలోయ బొగ్గు గని కార్మిక సంఘం రాష్ట్ర నాయకులు మేకల పోచమల్లు,టియుసిఐ రాష్ట్ర నాయకులు శంకర్,సింగరేణి గని కార్మిక సంఘం నాయకులు అంబాల మహేందర్,తెలంగాణ ఉద్యమకారుల వేదిక నాయకులు డోలి సుకుమార్, గంగారాం,తదితరులు పాల్గొన్నారు…


