జర్నలిస్టు మృతి పట్ల సంతాపం తెలిపిన దోమకొండ జర్నలిస్టులు..
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; 06 (అఖండ భూమి న్యూస్);
నిజాంసాగర్ సీనియర్ జర్నలిస్టు సల్ల ఆశన్న గుండెపోటుతో మృతి చెందాడు. ఆయన మృతి పట్ల దోమకొండ ప్రెస్, క్లబ్ టియుడబ్ల్యూజే ఐజేయు జిల్లా కార్యవర్గ సభ్యులు ముదాం శివశంకర్ ఆధ్వర్యంలో గురువారం దోమకొండ మండల కేంద్రంలోని పాత బస్టాండ్ చౌరస్తాలో రెండు నిమిషాల పాటు మౌనం పాటించి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి సభ్యుడు తీగల తిరుమల గౌడ్, అబ్రబోయిన శ్రీనివాస్, బిజెపి మాజీ అధ్యక్షుడు చింతల రాజేష్, కర్రోల శ్యాంసుందర్ గౌడ్, జర్నలిస్టులు అందే గణేష్, అల్లె రవి, సాప శ్రీనివాస్, అబ్ర బోయిన శ్రీనివాస్, దేవోళ్ళ రాము, ప్రవీణ్, తదితరులు పాల్గొన్నారు.
You may also like
రాజ్యాధికారం సాధన ద్వారా నే దళిత బహుజన కులాల కు విముక్తి ; దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి. కృష్ణ స్వరూప్
కాంగ్రెస్ ప్రభుత్వ 420 హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసింది…
రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలను ప్రారంభించిన జిల్లా అధ్యక్షుడు తీగల తిరుమల గౌడ్…
రైతుల అభ్యున్నతే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్…
దోమకొండలో ఆడుదాం క్రీడా దినోత్సవ వేడుకలు…


