ప్రచారంలో దూసుకుపోతున్న కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి పార్సి సరిత ధనంజయ్..!
44వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి సరిత ధనుంజయ్ కాంగ్రెస్ పార్టీ ..
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; ఫిబ్రవరి 04 (అఖండ భూమి న్యూస్);
కామారెడ్డి పట్టణంలోని 44వ వార్డులో కౌన్సిలర్ కాంగ్రెస్ అభ్యర్థి సరిత ధనంజయ్ బుధవారం ప్రచారంలో దూసుకుపోతున్నారు. 44వ కౌన్సిలర్ వార్డులో తన ప్రచార రథం తో పాటు తన అనుచరులు, మద్దతుదారులతో కలిసి పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించారు. 44వ వార్డు అభివృద్ధిలో దూసుకుపోవాలంటే చేతి గుర్తుపై ఓటు వేసి అమూల్యమైన ఓటును తనకు వెయ్యాలని అభ్యర్థించారు. గత పాలకుల మాదిగ కాకుండా ప్రస్తుతం మారుతున్న అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని జిల్లా కేంద్రంలోని 44వ వార్డును అన్ని రకాల అభివృద్ధిలో ముందుకు తీసుకుపోవడమే తమ లక్ష్యమని అన్నారు. స్థానిక మౌనిక సదుపాయలతో పాటు, 44వ వార్డును కామారెడ్డి జిల్లాలోని ఆదర్శవంతమైన వార్డుగా అభివృద్ధి చేస్తానని అన్నారు. ఒక్కసారి అవకాశం ఇచ్చి చూడండి అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్తానని వేడుకున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉందని వారి సహకారంతో వార్డు అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, పట్టణ ప్రజలు పాల్గొన్నారు.


