కామారెడ్డిలో కాంగ్రెస్‌కు భారీ మద్దతు…

కామారెడ్డిలో కాంగ్రెస్‌కు భారీ మద్దతు…

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; ఫిబ్రవరి 5 (అఖండ భూమి న్యూస్);

రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ సమక్షంలో గురువారం గెలుపు ప్రతిజ్ఞ
కామారెడ్డి మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ పార్టీకి మద్దతు పెరుగుతోంది.

పట్టణంలోని 42, 43 వార్డుల నుండి ప్రజలు భారీ సంఖ్యలో తరలివచ్చి, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీకి తమ సంపూర్ణ మద్దతు ప్రకటించారు.

అభివృద్ధిని చూసే ఈ నిర్ణయం వార్డు ప్రజలు తీసుకున్నారని అన్నారు.

షబ్బీర్ అలీ గారు కామారెడ్డి నియోజకవర్గంలో చేపడుతున్న అభివృద్ధి పనులను చూసి ఆకర్షితులమయ్యామని ఈ సందర్భంగా స్థానిక ప్రజలు పేర్కొన్నారు.

కాంగ్రెస్ పార్టీ చేస్తున్న సేవలు, షబ్బీర్ అలీ నాయకత్వంపై మాకు నమ్మకం ఉంది. అందుకే మా 42, 43 వార్డులలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను స్వచ్ఛందంగా భారీ మెజారిటీతో గెలిపించుకుంటాం అని వారు నినదించారు.

ఈ సందర్భంగా వార్డు ప్రజలను ఉద్దేశించి మహమ్మద్ అలీ షబ్బీర్ మాట్లాడుతూ..
ప్రజలు చూపిస్తున్న ప్రేమాభిమానాలకు కృతజ్ఞతలు తెలిపారు.

నేరుగా కలవండి: “వార్డులలో ఎలాంటి సమస్యలు ఉన్నా, ఏవైనా ఇబ్బందులు ఎదురైనా సంకోచించకుండా నేరుగా నా దృష్టికి తీసుకురండి. మీ సమస్యలను పరిష్కరించడానికి నేను ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానాని అన్నారు.

సంక్షేమానికి పెద్దపీట: కాంగ్రెస్ ప్రభుత్వం పేదల సంక్షేమం కోసం పని చేస్తోందని, అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పథకాలు అందేలా చూస్తామని హామీ ఇచ్చారు.

అభివృద్ధికి ఓటు వేయండి పట్టణాన్ని మరింత సుందరంగా, సౌకర్యవంతంగా తీర్చిదిద్దాలంటే కాంగ్రెస్ అభ్యర్థుల విజయం అవసరమని ఆయన స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో 42 వ వార్డు అభ్యర్థి కుబ్రా ఆతీక్.43 వార్డ్ అభ్యర్థి సోమన్నగారి రాజు స్థానిక కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు , పెద్ద ఎత్తున మహిళలు, యువత పాల్గొన్నారు.

Akhand Bhoomi News

error: Content is protected !!