ముత్యంపేటలో వాడవాడలా ఎల్లమ్మకు బోనాలు ఊరేగింపు…
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; ఫిబ్రవరి 3 (అఖండ భూమి న్యూస్);
కామారెడ్డి జిల్లా దోమకొండ మండలం ముత్యంపేట్ గ్రామంలో ఈనెల 2న ప్రారంభమైన ఎల్లమ్మ ఉత్సవాలు గౌడ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకుంటున్నారు. మంగళవారం ఉదయం రేణుక ఎల్లమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారికి అభిషేకాలు, తీర్థ ప్రసాద వినియోగం నిర్వహించారు. ఆలయం కు వచ్చిన భక్తులకు ఆలయ కమిటీ వారు భారీ ఏర్పాట్లు చేశారు. సాయంత్రం గౌడ సంఘం ఆధ్వర్యంలో అన్ని వాడాల నుండి బోనాలను తీసి డప్పు వాయిద్యాలతో, శివసత్తులు నాటి నృత్యములతో అమ్మవారికి భక్తిశ్రద్ధలతో సమర్పించారు. నాలుగవ తేదీన చక్కర తీర్థం, జాతర ఉత్సవాలు, ఒగ్గు కథ కాలక్షేపం నిర్వహిస్తారు. రాత్రి 8 గంటలకు మిద్దె రామ గౌడ్ మనవడి మిత్ర బృందంతో ఒగ్గు కథ కాలక్షేపం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ముత్యంపేట్ గ్రామ గౌడ సంఘం ప్రతినిధులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
You may also like
కలెక్టరేట్ ప్రజావాణిలో 125 దరఖాస్తులు స్వీకరణ…
_పీఎం కిసాన్ డబ్బులు పడలేదా? ఈ నెంబర్కు కాల్ చేస్తే చాలు!_
కామారెడ్డిలో కాంగ్రెస్ పార్టీలో భారీ చేరికలు…
ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ ఐ ఆర్) 2026 ఓటరు జాబితా పై రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం…
25 న నిర్వహించనున్న నశా ముక్త్ భారత్ అభియాన్ ర్యాలీని విజయవంతం చేయాలి…


