ముదిరాజ్ జాతి హక్కుల సాధనకై నిరంతర ఉద్యమం..!

ముదిరాజ్ జాతి హక్కుల సాధనకై నిరంతర ఉద్యమం..!

– డా. భట్టు విఠల్ ముదిరాజ్..

*బి సి ఏ _ సాధించే వరకు పోరాటం ఆగదు… ప్రభుత్వ హామీల అమలుకు డిమాండ్..

స్థానిక సంస్థల ఎన్నికల్లో జాతి శక్తి నిరూపణ – వందలాది ప్రజాప్రతినిధుల గెలుపు..

యువత, మహిళలు, విద్యార్థులే ఉద్యమ బలం – గ్రామగ్రామాన ఐక్యతకు పిలుపు..

 

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; ఫిబ్రవరి 3 (అఖండ భూమి న్యూస్);

* జాతి ఐక్యతతోనే ముదిరాజ్ జాతి హక్కుల సాధన సాధ్యమని తెలంగాణ ముదిరాజ్ మహాసభ కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు డాక్టర్ భట్టు విఠల్ ముదిరాజ్ స్పష్టం చేశారు. ఎల్లారెడ్డి మండలం అజామాబాద్ గ్రామంలో మంగళవారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ముదిరాజ్ జాతికి జరుగుతున్న అన్యాయాలపై ఉద్యమం మరింత ఉధృతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. ప్రభుత్వంలో ఉన్న ప్రతినిధులు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. 2014 నుంచి 2026 వరకు కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా అనేక గ్రామాల్లో జాతి జెండాల ఆవిష్కరణలు, సాంస్కృతిక కార్యక్రమాలతో ఐక్య ఉద్యమాన్ని కొనసాగిస్తున్నామని తెలిపారు. 2025లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో 65 మంది సర్పంచులు, 172 మంది ఉపసర్పంచులు, 364 మంది వార్డు సభ్యులు గెలుపొందడం జాతి ఐక్యతకు నిదర్శనమన్నారు. BC-A సాధన కోసం ర్యాలీలు, ధర్నాలు, కలెక్టర్ కార్యాలయ ముట్టడులు, భారీ బహిరంగ సభలు నిర్వహించామని, అట్రాసిటీ కేసుల అంశంలో అంబేద్కర్ సంఘాలతో సమన్వయం వల్ల కేసులు తగ్గాయని తెలిపారు. 78 గ్రామాల్లో మత్స్యశాఖలో 689 మందికి సభ్యత్వాలు కల్పించడం ఉద్యమ విజయంగా పేర్కొన్నారు. రాబోయే స్థానిక మున్సిపల్ ఎన్నికల్లో పార్టీలకు అతీతంగా ముదిరాజ్ జాతి బిడ్డల విజయానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. BC-A సాధించే వరకు పోరాటం నిరంతరంగా కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ అధ్యక్షులు యాదయ్యా ముదిరాజ్, ఎల్లారెడ్డి మండల అధ్యక్షుడు ప్యాలాల రాములు ముదిరాజ్, జిల్లా యువజన కార్యదర్శి వెల్లుట్ల సంతోష్ కుమార్ ముదిరాజ్, మండల యూత్ ఉపాధ్యక్షులు నీల రవి ముదిరాజ్, లక్ష్మణ్ ముదిరాజ్, నాగరాజు ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు.

Akhand Bhoomi News

error: Content is protected !!