ప్రజా సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో తాసిల్దార్ కార్యాలయం ముందు ధర్నా
భద్రాద్రి కొత్తగూడెం జూన్ 23 అఖండ భూమి వెబ్ సైట్ : సిఐటియు,ఐద్వా,వ్యాకస,డివైఎఫ్ఐ,కెవిపిఎస్ సంఘాల ఆధ్వర్యంలోగృహలక్ష్మి పథకంలో ఐదు లక్షలు ఇంటికి మంజూరు చేయాలని ఇంటి స్థలాలు లేని వారికి ఇంటి స్థలాలు ఇవ్వాలని,పూర్తయిన డబల్ బెడ్ రూమ్ ఇళ్లను వెంటనే పంపిణీ చేయాలని,లక్ష రూపాయల బీసీ రుణాల దరఖాస్తుగడువు పెంచాలని తదితర డిమాండ్లతో శుక్రవారం భద్రాచలం పట్టణంలోని స్థానిక తాసిల్దార్ కార్యాలయం ముందు భారీ ధర్నా ప్రజా సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగినది.ఈ కార్యక్రమానికి సిఐటియు పట్టణ కన్వీనర్ ఎంబీ నర్సారెడ్డి అధ్యక్షతన జరిగినది.ఈ సందర్భంగా వికాస ఉపాధ్యక్షులు గడ్డం స్వామి,కోకన్వీనర్ ఎం రేణుక కార్యదర్శి డి లక్ష్మీ లు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం గత ఎన్నికల ముందు ఖాళీ స్థలాలు ఉన్నవారికి ఇంటి నిర్మాణానికి ఐదు లక్షల మంజూరు చేస్తామని,అదేవిధంగా అర్హులైన అందరికీ డబుల్ బెడ్ రూమ్ ఇల్లు నిర్మించేస్తామని,ఇంటి జాగాలు లేని వారికి స్థలాలు ఇస్తామని,అర్హులైన బీసీల అందరికీ లక్ష రూపాయలు ఆర్థిక సహాయం ఇస్తామని హామీ ఇచ్చి, గడిచిన ఐదేళ్ల కాలంలో భద్రాచల పట్టణంలో నిర్మించిన డబల్ బెడ్ రూమ్ ఇల్లు ఒక్కరికి కూడా పంపిణీ చేయలేదని, అలాగే గృహలక్ష్మి పథకానికి మూడు లక్షలు మాత్రమే ఇస్తామని ప్రకటించి దానిని గతంలో ప్రకటించిన ఐదు లక్షలు ఇచ్చే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని,ఇంటి స్థలాలు లేని వారికి స్థలం కేటాయించి గృహలక్ష్మి పథకంలో ఇల్లు మంజూరు చేయాలని అలాగే ఇటీవల కాలంలో ప్రకటించిన అర్హులైన బీసీలకు లక్ష రూపాయలు ఆర్థిక సహాయం చేస్తామని ప్రకటించి ఈనెల 20వ తేదీతో గడువు ముగిసినందున దాని గడువు పెంచాలని కోరినారు.లేనియెడల పెద్ద ఎత్తున ప్రజలను సమీకరించి ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు.కేంద్ర ప్రభుత్వం ప్రధాని ఆవాస్ యోజన కింద ఒక్కో ఇంటికి 10 లక్షలు మంజూరు చేస్తామని చెప్పినందున తక్షణమే వాటిని మంజూరు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసినారు.కావున రెండు ప్రభుత్వాలు వచ్చిన చేసుకొని రేపు జరగబోయే ఎన్నికల్లో లోపు ప్రభుత్వాలు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేసినారు.ఈ కార్యక్రమంలో ఐద్వా జిల్లా నాయకులు యూ జ్యోతి,యన్ లీలావతి,కే కుసుమ ,జీవనజ్యోతి,వనమ్మ ,సిఐటియు నాయకులు జిల్లా కమిటీ సభ్యులు ఎం నాగరాజు ,పి సంతోష్,లక్ష్మణ్ ,డి రామకృష్ణ ,వి రాము ,జాకీ,కాపుల రవి లు ప్రజాతంత్ర ఉద్యమ నాయకులు వై వెంకట రామారావు ,ఎస్ రామకృష్ణ,సిహెచ్ మాధవరావు ,గిరిజన సంఘం కార్యదర్శి శ్రీను విజయ,కె వి పి స్ జిల్లా నాయకులు కోరాడ శ్రీను చేగొంటి శ్రీను డివైఎఫ్ఐ పట్టణ అధ్యక్ష కార్యదర్శులు సతీష్ ప్రేమ్ కుమార్ ఎంబి నర్సారెడ్డి సీఐటీయూ కన్వీనర్ తదితరులు పాల్గొన్నారు.



