గురుసేవలో తరిస్తున్న అపర రామానుజులు డా. కృష్ణ చైతన్య స్వామి

గురుసేవలో తరిస్తున్న అపర రామానుజులు డా. కృష్ణ చైతన్య స్వామి

భద్రాచలం జూన్ 23 అఖండ భూమి వెబ్ న్యూస్భ :

ద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం

పట్టణంలోని శ్రీ అహోబిల మఠం వేదికగా శుక్రవారం మెగా రక్తదాన శిబిరాన్ని శ్రీ నృసింహ సేవా వాహిని ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగినది. ఈ సందర్భంగా సంస్థ వ్యవస్థాపకులు డా.కృష్ణ చైతన్య స్వామి మాట్లాడుతూ ఈరోజు అహోబిలం మఠాధిపతులు తమ గురుదేవులు శ్రీశ్రీశ్రీ శ్రీవన్ శఠకోప శ్రీ రంగనాథ యతీంద్ర మహాదేషికన్ స్వామివారి 68 వ తిరు నక్షత్ర మహోత్సవం సందర్భంగా ఉభయ తెలుగు రాష్ట్రాలలోని అనేక ప్రాంతాలలో అన్నార్తులకు అన్నదానం,వస్త్రదానంతో పాటు మెగా రక్తదాన శిబిరాలను కూడా నిర్వహించడం జరిగినదని అన్నారు. ఎంతోమంది నృసింహ భక్త కుటుంబ సభ్యులు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నారని, గత కొన్ని సంవత్సరాలుగా తమ గురువుగారి తిరునక్షత్ర మహోత్సవం సందర్భంగా ఎన్నో సేవా కార్యక్రమాలను నిర్వహిస్తూ ఉన్నామని, అందులో భాగంగానే ఈ సంవత్సరం వృద్ధులకు అనాధలకు,అన్న ప్రసాద వితరణ మరియు వస్త్ర దానం కూడా చేయడం జరిగినదని అన్నారు. ఈ లోకంలో తను ఎలా ఉన్నా తన శిష్యులు మాత్రం ప్రయోజకులు కావాలని అహర్నిశలు శ్రమించే నిస్వార్థ సేవకుడు గురువని అటువంటి గురు సేవలో తరించే భాగ్యం మన నృసింహ సేవా వాహినికి దక్కడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నామని, నిజమైన గురుభక్తికి ప్రత్యేక నిదర్శనం శ్రీ నృసింహ భక్త కుటుంబమేనని, సమాజసేవే పరమావధిగా భావించి గురువుగారి సూచన మేరకు ప్రతినిత్యం ఎక్కడ సమస్య వచ్చినా వెంటనే స్పందించి సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి నృసింహ సేవా వాహిని సభ్యులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో డా.కృష్ణ చైతన్య స్వామి ట్రస్టీ శ్రీధర్ స్వామి నృసింహ సేవా వాహిని బృందం తదితరులు పాల్గొన్నారు.

Akhand Bhoomi News

error: Content is protected !!