కోదాడ బరిలో యువ ఎన్నారై?…

అఖండ భూమి సూర్యాపేట జిల్లా కోదాడ.

•జనసేన పార్టీ అభ్యర్థిగా రంగంలోకి మేకల సతీష్ రెడ్డి

•ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన జనసేన అధ్యక్షుడు

•గతంలో నల్లగొండ ఎంపీగా పోటీ

•కోదాడ ప్రజలకు అత్యంత సుపరిచితుడు

•సతీష్ రెడ్డి రంగంలోకి దిగడంతో తప్పని త్రిముక పోరు

ఉద్యమాల గడ్డ తుంగతుర్తి ముద్దుబిడ్డ నిరంతరం ప్రజల్లో ఉంటూ ప్రజల సమస్యలను తన సమస్యలుగా వెలుగేతుతున్న ఉద్యమ నేత

జనసేనానివేసిన బాటలో ఉమ్మడి నల్లగొండ జిల్లాలో తనదైన శైలిలో సమస్యలపై సంధించిన బాణం.. మరెవరో కాదు. మేకల సతీష్ రెడ్డి …

ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎన్నారై మేకల సతీష్…?

కోదాడ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎన్నారై మేకల సతీష్ రెడ్డి రంగంలోకి దిగనున్నారు… జనసేన పార్టీ రాష్ట్ర నాయకుడిగా పార్టీ కార్యక్రమంలో విస్తృత సేవలు అందిస్తూ ఆ పార్టీ బలోపేతములో కృషి చేస్తూ వస్తున్నాడు. గతంలో ఆయన సేవలను గుర్తించిన జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పార్టీ తరపున నల్లగొండ ఎంపీగా పోటీ చేసే అవకాశం ఇచ్చారు ఎంపీగా పోటీ చేసి యువతలో మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు సతీష్ రెడ్డి. ఎంపీగా పోటీ చేసి ఓడిన ప్రజలలోనే ఉంటూ వారి సమస్యలను తెలుసుకుంటూ ఆపదలో ఉన్న కుటుంబాలకు ఆర్థిక సహాయాలు అందిస్తూ నిరంతరం ప్రజల మనిషిగా తనదైన శైలిలో ముందుకు సాగుతున్నాడు. ఆయన చేస్తున్న సేవలను గుర్తించిన జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఆంధ్ర సరిహద్దు ప్రాంతం కోదాడ కావడంతో ఆంధ్ర ఓటర్లు అధికంగా ఉండడంతో పార్టీకి మరింత కలిసి వస్తుందని ఆలోచనతో కోదాడ నుంచి ఎమ్మెల్యేగా బరిలో దిగమని సతీష్ రెడ్డికి సూచించారు దీంతో అధ్యక్షుడు ఆదేశాలతో మేకల సతీష్ రెడ్డి రంగం సిద్ధం చేసుకున్నాడు…

సతీష్ రెడ్డి ప్రస్థానం…

వెలుగు పల్లి గ్రామం నుంచి మొదలైన తన ప్రయాణం ఎంతోమంది యువతకు ఉపాధి కల్పించే స్థాయికి ఎదిగిన తీరు.. ఎంత స్పూర్తిదాయకం వెలుగు పల్లి గ్రామం..మేకల నర్సిరెడ్డి వెంకట లక్ష్మమ్మ గార్ల ఏకైక కుమారుడు. శ్రీ మేకల సతీష్ రెడ్డి. కనీస వసతులు లేని ప్రభుత్వ పాఠశాలలో విద్యను అభ్యసించి. పై చదువుకై హైదరాబాద్ పట్టణంలో ఉన్నత విద్యను పూర్తి చేసుకొని అమెరికా దేశానికి వెళ్లి.. తనధైన దేశం కోసం తనదైన ప్రాత ప్రజల కోసం ఏదో చెయ్ాయాలనే తపనతో స్వతహాగా ఆయన పవన్ కళ్యాణ్ అభిమాని కావడంతో పవనిజం నినాదంతో ఎన్నో స్వచ్చంద కార్యక్రమాలు చేస్తూ. 2014లో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆశయాలు అధినేత ఆదేశంతో లో ఉమ్మడి నల్లగొండ జిల్లా ఎంపీగా పోటీ చేయడం జరిగింది. విద్యార్థి నాయకుడిగా మొదలైన తన రాజకీయప్రస్థానం జనసేన పార్టీలో ఉమ్మడి నల్లగొండ జిల్లా ఇన్చార్జిగా తెలంగాణ రాష్ట్ర పర్యవేక్షణ కమిటీ సభ్యులుగా పనిచేశారు ..పవన్ కళ్యాణ్ సన్నిహితులుగా.ఎదుగుతూ ఎన్నో స్వచ్చంద సేవా కార్యక్రమాలు చేయడం స్వతహాగా ఆయన నైజం… తన పుట్టి పెరిగిన గ్రామం లోని ప్రభుత్వ పాఠశాలలో తన తల్లి పేరు మీద గ్రంథాలయాన్ని కట్టించడం, తుంగతుర్తి కి అతి సమీపంలో ఉన్నటువంటి ప్రభుత్వ బాలికల గురుకుల పాఠశాలలో వసతులు ఏర్పాటు చేయడం కరోనా మొదటి దశలో రెండవ దశలో ఎంతోమంది అనర్హుల ఆకలి తీర్చడం ఎంతో మంది నిరుపేదలకు తను చేసిన సేవలు మరువలేనివి ముఖ్యంగా తుంగతుర్తి నియోజకవర్గ మద్దిరాల మండలం

ముకుందాపురం గ్రామంలో తల్లి తండ్రి కోల్పోయినటువంటి ముగ్గురు బాలికలను చేరదీసి ఆర్థికంగా ఫిక్స్డ్ డిపాజిట్ చేయడం అలాగే తన పరిచయస్తులైనటువంటి ఎంతోమంది రాజకీయ నాయకుల ద్వారా ఆర్ధిక సహాయం చేయించి

ఈరోజు ఆ ముగ్గురు పిల్లలు వాళ్ళపై కాళ్లపై నిలబడేలాగా చేసిన గొప్ప మానవతావాది..

ఇక రాజకీయంగా….

మేకల సతీష్ రెడ్డి తుంగతుర్తి నియోజకవ్ధం వెలుగుపల్లి గ్రామంకు చెందినవాడు ఉన్నత విద్యావంతుడైన సతీష్ రెడ్డి ఉద్యోగ రీత్యా అమెరికాలో ఉంటున్నప్పటికీ, స్వదేశానికి సేవ చేయాలని

ముఖ్యంగా కోదాడ నియోజకవర్గ ప్రజల సమస్యల కోసం రాజకీయ వేదికను ఎంచుకొని ప్రజాసేవకు అంకితమవ్వాలనే బలమైన సంకల్పంతో జనసేన పార్టీలో చేరి క్రియాశీల రాజకీయాలలో కొనసాగుతున్నారు. పవన్ కళ్యాణ్ అభిమాని కావడంతో సహజంగానే జనసేన పార్టీలో చేరి గత పార్లమెంట్ ఎన్నికల్లో నల్గొండ పార్లమెంట్ నియోజకవర్గం బరిలో నిలిచి ఓడిపోయారు …అప్పటినుండి ఆయన పలు సేవా కార్యక్రమల ద్వారా ప్రజాక్షేత్రంలోనే ఉంటుూ వస్తున్నారు.. యువతకు ఉపాధి కల్పనలో భాగంగా ఎంతో మంది యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ వారు బంగారు భవిష్యత్తుకు ఒక హామీల నిలబడ్డారు అంతేకాకుండా సేవా కార్యక్రమాలలో ఎప్పుడూ ముందుఉంటూ దళిత బహుజన సామాజికఆడబిడ్డలకు. సొంత అన్నల వారికి ఎప్పుడూ అండగా నిలుస్తున్నారు..

ఆర్థిక సహాయం అందిస్తూ … అండగా

నిరుపేద విద్యార్థులకు స్కాలర్షిష్లు ఇస్తూ ప్రతిభావంతులైన ఎంతోమంది విద్యార్థినీ విద్యార్థులను సొంత ఖర్చులతో చదివిస్తూ అలా చదువుకున్న ఎంతోమంది విద్యార్డులు ప్రస్తుతం ఉన్నత స్థానాల్లో నిలబడ్డారు.. ఎంతోమంది యువత కు పోలీస్ ,కానిస్టేబుల్ లాంటి ప్రభుత్వ ఉద్యోగాలకు శిక్షణ కూడా ఇప్పిస్తున్నారు.. తెలంగాణ ఉద్యమ ఉవ్వెత్తున లేస్తున్న సమయంలో తెలంగాణ ఆకాంక్షను ప్రతిబింబించేలా ఉద్యమస్పూర్తి రగిలించేలా ఎన్నో ఉద్యమ గీతాలను చిత్రీకరించడం కూడా జరిగింది. ఎంతోమంది పేద కళాకారులకు ఆర్ధికంగా సహాయం చేయడం జరిగింది. నిరుపేద అయినటువంటి ఎంతోమందిని సొంత ఖర్చులతో శస్త్ర చికిత్సలు కూడా చేయించడం జరిగింది .కరోనా సమయంలో వ్యాక్సిన్ ల కోసం ఎంతో ఇబ్బంది పడుతున్నటువంటి ఎంతోమందికి సొంత ఖర్చులతో వ్యాక్సిన్లు కూడా అందివ్వడం జరిగింది తన సొంత ఖర్చులతో గూడు లేక రోడ్డుపై నిద్రిస్తున్నటువంటి ఎంతోమంది అభాగ్యులకు దుప్పట్లు ఆహార. వసతి నిరంతరం ఏర్పాటు చేశాడు…

ఎన్నో అవార్డులు ఆయన సొంతం…

తను చేసిన సేవా కార్యక్రమాలకు గుర్తించిన పలుస్వచ్చంద సంస్థల నుండి రెండు తెలుగు రాష్ట్రాల.

నుండి ఎన్నోీ అవార్డులను కూడా సొంతం చేసుకోవడం.. ముఖ్యంగా దాసరి నారాయణరావు సేవ రత్న బిరుదును.శిల్పకళా వేదికలో అందుకోవడం ఇందులో ముఖ్యమైనది. తను ఉంటున్నటువంటి అమెరికా దేశంలో ఎంతోమంది తెలుగు విద్యార్థులకు చేయుూతనిస్తూ ఉద్యోగ అవకాశాలు కల్పించడం.

నిరంతరం సమస్యలపై సమరం..

కోదాడ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి సమస్యను స్వయంగా తెలుసుకొని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తూ ఆ సమస్యలకు ఒక పరిష్కారాలు చూపిస్తున్నటువంటి నేత కాంగ్రెస్, బిఆర్ఎస్ బలంగా ఉన్న ఉమ్మడి నల్లగొండ జిల్లాలో సతీష్ రెడ్డి జనాసేన పార్టీని బలోపేతం చేస్తూ పని చేస్తున్నారు. సతీష్ రెడ్డి, పార్టీలో ఆయన రాష్ట్ర స్థాయిలోసైతం బలమైన నేతగా ఎదిగారు.కార్యకర్తలకు అండగా ఉంటూ ప్రమాదవశాత్తు చనిపోయినటువంటి చౌటుప్పల్ కోదాడ ప్రాంతాలకు చెందినటువంటి ఇద్దరు కార్యకర్తలకు జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి చేతుల మీదుగా చెరొక ఐదు లక్షల రూపాయల చెక్కులను ఇప్పివ్వడం జరిగింది… ముఖ్యంగా కోదాడ నియోజకవర్గంలో ఉన్నటువంటి సమస్యలపై పోరాడుతూ కార్యకర్తలకు అండగా భరోసానిస్తూ

అధికార పార్టీ వాళ్లు సమస్యలపై పోరాడుతుంటే

కేసులు పెట్టడం లాంటివి చేస్తున్నా కూడా వాటిని ఎదిరిస్తూ ముందుకు సాగుతున్న నేత మేకల సతీష్ రెడ్డి .. నిస్వార్ధ రాజకీయాలు చేస్తూ మిగతా రాజకీయ పార్టీ నేతలతో సత్సంబంధాలు కలిగి ఉంటూ కోదాడ నియోజకవర్గ ప్రాంత ప్రజల సమస్యలపై నిరంతరం పోరాడుతూ వెలుగెత్తుతూ రాబోయే రోజుల్లో కోదాడ నియోజకవర్ణం బరిలో ఉంటూ కోదాడ ప్రజల ఆశీర్వాదంతో ఎమ్మెల్యేగా మేకల సతీష్ రెడ్డి పోటీ చేయనున్నారు..

ఈసారి కోదాడలో జనసేన పార్టీ నుండి కూడా గట్టి పోటీ ఉండడంతో త్రిముఖ పోరు తప్పదని కోదాడ పట్టణ ప్రజలు రాజకీయ విశ్లేషకులు చర్చించుకుంటున్నారు…

Akhand Bhoomi News

error: Content is protected !!