ఫోన్ ట్యాపింగ్ కేసులో వాంగ్మూలం ఇచ్చిన టీపీసీసీ జనరల్ సెక్రటరీ…
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జూన్ 26 (అఖండ భూమి న్యూస్)
టీపీసీసీ జనరల్ సెక్రటరీ గడ్డం చంద్రశేఖర్ రెడ్డి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫోన్ ట్యాంపరింగ్ పై వాంగ్మూలం ఇచ్చారు. బుధవారం లీగల్ టీంతో కలిసి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి జూబ్లీహిల్స్ సిట్ కార్యాలయంకు మధ్యాహ్నం హాజరై సుమారు రెండు గంటల పాటు వాంగ్మూలం ఇచ్చారు. ఈ సందర్బంగా జూబ్లీహిల్స్ ఏసీపీ, సిట్ అధికారులు 2023 ఎన్నికల సమయంలో జరిగిన ఘటనల గురించి అడిగి తెల్సుకున్నారు.
నాలుగు రోజుల క్రితం జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ నుంచి ఫోన్ రావడం, నోటీసులు రావడంతో ఈ రోజు హాజరై వివరాలు అందించినట్లు టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. తనతో పాటు పిఎ కరుణాకర్ రెడ్డి, డ్రైవర్ అశోక్, కాంగ్రెస్ నాయకులు కే అరవింద్ కుమార్ లు హాజరయ్యమన్నారు. ఫోన్ ట్యాపింగ్ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో కామారెడ్డిలో తన ఇంటిపైకి డిఎస్పి ఆధ్వర్యంలో తరుచు తనిఖీలు, దాడులు చేశారన్నారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ లో చేరడంతో తనపై ఫోన్ ట్యాపరింగ్ చేశారని, తన అనుచరులపై ఫోన్ ట్యాప్ చేయడంపై మండి పడ్డారు. వ్యక్తిగత ప్రయివసి దెబ్బతీసే విధంగా ఫోన్ త్యాపరింగ్ చేయడం సరికాదన్నారు.