ఇందిరమ్మ ఇల్లుకు ముగ్గులు వేసిన సర్పంచ్ ఐరేని నరసయ్య…
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; ఫిబ్రవరి 5 (అఖండ భూమి న్యూస్);
కామారెడ్డి జిల్లా దోమకొండ మండల కేంద్రంలో గురువారం ఇందిరమ్మ ఇల్లును మంజూరు చేస్తూ ప్రొసీడింగ్ పత్రాలను సర్పంచ్ ఐరన్ నరసయ్య చేతుల మీదిగా లబ్ధిదారులకు అందజేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహకారంతో ఇల్లు లేని నిరుపేదలందరికీ ఇండ్లను మంజూరు చేయడమే లక్ష్యంగా పెట్టుకొని తెలంగాణ రాష్ట్రంలో భారీ సంఖ్యలో ఇల్లు మంజూరు చేస్తున్నామని అన్నారు. నిరుపేద ఇల్లు లేని వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి సభ్యుడు తీగల తిరుమల గౌడ్, సీతారాం మధు ముదిరాజ్, ఉప సర్పంచ్ బొమ్మెర శ్రీనివాస్, పాలకుర్తి శేఖర్, నాగారపు ఎల్లయ్య, కదిరే గోపాల్ రెడ్డి లు గ్రామస్తులు పాల్గొన్నారు.
You may also like
రాజారెడ్డి జనసేన ట్రస్టు ద్వారా పాఠశాలకు బెంచిలు డెస్కులు..పంపిణీ…
అర్హులైన జర్నలిస్టులందరికీ అక్రిడిటేషన్ కార్డులు జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ హామీమ్మ్…
ఇల్లు లేని నిరుపేదలందరికీ ఇందిరమ్మ ఇల్లు మంజూరు…
కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణ రెడ్డిపై మూడు క్రిమినల్ కేసులు కొట్టివేత…
మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ నూతన గృహప్రవేశానికి హాజరైన కౌన్సిలర్స్ గిరిగంటి దంపతులు…


