తేదీ: 8/8 /2026 ప్రెస్ నోట్
. *ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడుకుందాం*. 
క్విట్ ఇండియా ఉద్యమస్ఫూర్తితో
ఆగస్టు 10న జరిగే జైల్ భరో ను జయప్రదం చేద్దాం…
ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడుకుందాం..
. *నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలి..
సిఐటియు జిల్లా చంద్ర శేఖర్..
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; ఆగస్టు 08 (అఖండ భూమి న్యూస్)
. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని యూనియన్ ఆఫీసులో సిఐటియు యూనియన్ ఆధ్వర్యంలో ఆగస్టు 10న జరిగే జైలు బరో కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కరపత్రాలు విడుదల చేయాలన్నారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా అధ్యక్షులు చంద్రశేఖర్ మాట్లాడుతూ. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని , ప్రభుత్వ రంగ సంస్థలు బ్యాంక్, రైల్వేస్, పోస్టల్ ,టెలికం, సింగరేణి, విమానాయా తదితర తదితర సంస్థలను ప్రైవేటీకరణ చేయకూడదు అని అన్నారు. ప్రజలందరికీ మెరుగైన వైద్యం అందించాలన్నారు. మందులపైన ప్రభుత్వాలు విధించిన పనులన్నింటిని రద్దు చేయాలి తదితర డిమాండ్ల సాధనకై క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో దేశవ్యాప్తంగా ఆగస్టు 10న జరిగే జైలు భరో నిరసన కార్యక్రమం లో భాగంగా కామారెడ్డి జిల్లా కేంద్రంలో జరిగే నిరసనలో జిల్లాలో ఉన్న అన్ని రకాల కార్మికులు, ఉద్యోగులు, రైతులు, వ్యవసాయ కార్మికులు ప్రజలు పాల్గొని జయప్రదం చేయాలని కోరారు.
. ఈ కార్యక్రమంలో నాయకులు రాజనర్సు, సత్యం గ్రామపంచాయతీ జిల్లా అధ్యక్షులు బాల్నర్సు, నాయకులు అంగన్వాడి యూనియన్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఇందిరా బాబాయ్ ,లక్ష్మి ,సవిత ,ఆశా యూనియన్ నాయకులు ఇందిరా ,,రాజశ్రీ మమత ,మున్సిపల్ యూనియన్ నాయకులు ఆయాజ్ ,మహమ్మద్, సంతోష్, నర్సింగ్ రావు, ప్రభు ఏడారపు రాజు దీవెన శివ రాజవ్వ మధ్యాహ్న భోజన కార్మిక సంఘం నాయకులు వెంకటేష్ ,కిష్ట గౌడ్ ,దుర్గయ్య ,ప్రమీల, అమాలి సంఘం నాయకులు బిల్లింగ్ వర్కర్స్ నాయకులు సాయిబాబా ,ఈశ్వర్ తదితరులు పాల్గొన్నారు.


