సింగూర్ నీటిని తాగునీటి అవసరాలకే వినియోగించాలి…
వర్షపు నీటిని ఒడిసిపట్టి భూగర్భ జలాలను పెంచాలి..
జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్..
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; ఆగస్టు 09 (అఖండ భూమి న్యూస్);
నిజామాబాద్, ఆగస్టు 08: సింగూర్ జలాశయంలో ప్రస్తుతం అందుబాటులో ఉన్న నీటిని తాగునీటి అవసరాలకే వినియోగిస్తూ, రానున్న వర్షాలను సద్వినియోగం చేసుకునేలా ముందస్తు చర్యలు చేపట్టాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అధికారులను ఆదేశించారు.
నిజామాబాద్ సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం ప్రధాన సమావేశ మందిరంలో శనివారం నిజామాబాద్ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా అధ్యక్షతన నిర్వహించిన జిల్లా నీటి పారుదల సలహా మండలి సమావేశంలో జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ వర్చువల్ విధానం ద్వారా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ మాట్లాడుతూ, సింగూర్ జలాశయంలో ప్రస్తుతం 4.140 టీఎంసీల నీరు నిల్వ ఉందని, జలాశయానికి మరమ్మతులు చేపడుతున్నందున పూర్తి సామర్థ్యం మేరకు నీటిని నిల్వ చేయలేని పరిస్థితి ఉందని తెలిపారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న నీటిని ప్రధానంగా తాగునీటి అవసరాలకు వినియోగించాలని సూచించారు.
ప్రస్తుతం ఉన్న నీటి నిల్వ సుమారు 60 నుంచి 90 రోజుల వరకు తాగునీటి అవసరాలను తీర్చగలదని తెలిపారు. రానున్న రోజుల్లో సమృద్ధిగా వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున సింగూర్ జలాశయంలో మరో 4 టీఎంసీల వరకు వరద నీటిని నిల్వ చేసుకునేలా ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు. తద్వారా నిజామాబాద్, కామారెడ్డి, మెదక్ జిల్లాలకు రానున్న ఐదారు నెలల పాటు తాగునీటి సరఫరాలో ఇబ్బందులు లేకుండా చూడవచ్చని పేర్కొన్నారు.
జలసిరి కార్యక్రమాల ద్వారా భూగర్భ జలాల పెంపు
వర్షపు ప్రతి చుక్కను ఒడిసిపట్టి భూగర్భ జలాలను పెంపొందించే లక్ష్యంతో కామారెడ్డి జిల్లాలో జలసిరి కార్యక్రమాలను విస్తృతంగా చేపడుతున్నామని జిల్లా కలెక్టర్ తెలిపారు. వర్షపు నీటిని నిల్వ చేయడం, భూమిలోకి ఇంకేలా చర్యలు చేపట్టడం ద్వారా భూగర్భ జలమట్టాలను పెంచేందుకు సంబంధిత శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు.
అలాగే కామారెడ్డి జిల్లాలోని కౌలాస్ నాలా, పోచారం ప్రాజెక్టులు పూర్తిస్థాయి నీటిమట్టాన్ని సంతరించుకున్నాయని తెలిపారు. ఆయకట్టు పరిధిలోని పంటలకు సాగునీటిని అందించేందుకు అందుబాటులో ఉన్న నీటి వనరులను సమర్థవంతంగా వినియోగించుకోవాలని సూచించారు. రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని సాగునీటి నిర్వహణ, పంటల ప్రణాళికపై అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ ఆదేశించారు.
సమావేశంలో ఉమ్మడి జిల్లాలోని నిజాంసాగర్, శ్రీరాంసాగర్, సింగూర్, కౌలాస్ నాలా, పోచారం, రామడుగు తదితర జలాశయాల నీటి నిల్వల పరిస్థితి, ఆయకట్టు పంటలకు సాగునీటి సరఫరా, ప్రత్యామ్నాయ పంటల ప్రణాళిక, పంటల వైవిధ్యీకరణ తదితర అంశాలపై చర్చించారు.
ఈ సమావేశంలో ప్రభుత్వ సలహాదారు, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి, నిజామాబాద్ గ్రామీణ ఎమ్మెల్యే డాక్టర్ ఆర్. భూపతిరెడ్డి, నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ గుప్తా, ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేశ్ రెడ్డి, నిజామాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, అదనపు కలెక్టర్ వి. భుజంగరావు, ట్రైనీ కలెక్టర్ సురేష్, జిల్లా రెవెన్యూ అధికారి గీత, నీటి పారుదల, భూగర్భ జలాలు, వ్యవసాయ, ఉద్యానవన కామారెడ్డి అదనపు స్థానిక సంస్థల కలెక్టర్ ఎన్ వై గిరి. బాన్స్వాడ ఆర్డిఓ రవీందర్ రెడ్డి. కామారెడ్డి వ్యవసాయ అధికారి మోహన్ రెడ్డి.
తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.
You may also like
ఆగస్టు 12 న కామారెడ్డి లో జరిగే గీతన్న చైతన్య యాత్ర సభను జయప్రదం చేయండి…
. *ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడుకుందాం*.
నూతన సొసైటీ చైర్మన్ చిందల శ్రీనివాస్ రెడ్డికి సన్మానం…
బాలాంజనేయ స్వామి దేవస్థానాన్ని సందర్శించిన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి…
కామారెడ్డి నియోజకవర్గ అభివృద్దే షబ్బీర్ ఆలీ లక్ష్యం …


