ఆగస్టు 12 న కామారెడ్డి లో జరిగే గీతన్న చైతన్య యాత్ర సభను జయప్రదం చేయండి…

ఆగస్టు 12 న కామారెడ్డి లో జరిగే గీతన్న చైతన్య యాత్ర సభను జయప్రదం చేయండి…

 

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; ఆగస్టు 09 (అఖండ భూమి న్యూస్);

కామారెడ్డి జిల్లా దోమకోండ గ్రామంలో గౌడ సంఘం ఆధ్వర్యంలో గీతన్న చైతన్య యాత్ర పోస్టర్ ఆవిష్కరణ చేయడం జరిగింది కల్లు గీత వృత్తి రక్షణకై చట్టం చేయాలని కల్లుగీత కార్మికులు వృత్తి రక్షణకై కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ. ఆగస్టు 2 నుంచి 18 వరకు నిర్వహించే కల్లుగీత కార్మికుల చైతన్య బస్సు యాత్రను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు ఆగస్టు 12 న మాచారెడ్డి మండలం లోకి ఉదయం 10 గంటలకు చైతన్య యాత్ర చేరుకుంటుందని కామారెడ్డి పట్టణం లో రేణుకా పంక్షన్ హల్ లో 12 గంటలకు జరిగే గీతన్న సభను జయప్రదం చేయాలని ఆదివారం పిలుపునిచ్చారు . గీతా కార్మికుల హక్కుల కోసం నిరంతరం పోరాటం చేయడం వల్ల అనేక విజయాలు సాధించామని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గీతా కార్మికుల సమస్యలను నిర్లక్ష్యం చేస్తోందని విమర్శించారు., 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న గౌడ కార్మికులకు పింఛన్లు మంజూరు చేయాలని, హైదరాబాద్ ట్యాంక్‌బండ్‌పై సర్వాయి సర్ధార్ పాపన్న విగ్రహాన్ని ఏర్పాటు చేసి ఆయన జయంతిని అధికారికంగా నిర్వహించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.తెలంగాణ వ్యాప్తంగా గీతా కార్మికుల సమస్యలను ప్రజలకు తెలియజేయడమే ఈ చైతన్య యాత్ర లక్ష్యమని పేర్కొన్నారు. మహబూబాబాద్ జిల్లా నుంచే ఈ యాత్ర ప్రారంభం అయ్యి ఆగస్టు 12 న కామారెడ్డి జిల్లా కు ఉదయం 10 గంటలకు మాచారెడ్డి కి బస్సు యాత్ర వస్తుందని అక్కడినుంచి బైక్ ర్యాలీ వచ్చి కామారెడ్డిట లో రేణుకా పంక్షన్ హల్ సభ ఉంటుందని సభ అనంతరం బిక్కనూర్ మధ్యాహ్నం 3 గంటలకు ఉంటుంది ఈ సభను గౌడ సంఘ సభ్యులంతా ఐక్యంగా పాల్గొని బస్సు యాత్రను సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు సుదర్శన్ గౌడ్, వెంకట్ గౌడ్, చంద్ర గౌడ్ రాజా నర్సగౌడ్ రవి గౌడ్ నరేష్ గౌడ్ ముత్యం గౌడ్ యాదాగౌడ్ సత్యనారాయణ గౌడ్ శ్రీకాంత్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Akhand Bhoomi News

error: Content is protected !!