పేకాట స్థావరంపై టాస్క్‌ఫోర్స్ మెరుపు దాడి

10 మంది అదుపులో,రూ.83,010 నగదు, 52 పేకముక్కలు,8 సెల్‌ఫోన్లు స్వాధీనం
బెల్లంపల్లి ఆగస్టు,09(అఖండ భూమి న్యూస్):మంచిర్యాల జోన్ నెన్నెల పోలీస్ స్టేషన్ పరిధిలోని మన్నెగూడెం గ్రామ శివారులో డబ్బులు పందెంగా పెట్టి పేకాట ఆడుతున్నారనే విశ్వసనీయ సమాచారంతో రామగుండం పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడి నిర్వహించారు.
టాస్క్‌ఫోర్స్ ఏసీపీ శ్రీనివాస్ నేతృత్వంలో ఎస్‌ఐలు రమేష్, లచ్చన్న ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ దాడిలో పేకాట ఆడుతున్న 10 మందిని అదుపులోకి తీసుకుని,వారి వద్దనుండి రూ.83,010 నగదు,52 పేకముక్కలు,8 మొబైల్ ఫోన్లు,ఒక హీరో గ్లామర్ ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు.పేకాట నిర్వహించినట్లు గుర్తించిన ఆర్గనైజర్ రాళ్లపేట శ్రీకాంత్‌తో పాటు శ్రీను, రాజ్‌కుమార్ పరారీలో ఉన్నారు.వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.స్వాధీనం చేసుకున్న నగదు,పేకముక్కలు, మొబైల్ ఫోన్లు,ద్విచక్ర వాహనంతో పాటు అదుపులోకి తీసుకున్న వ్యక్తులను తదుపరి చర్యల కోసం నెన్నెల పోలీస్ స్టేషన్‌లో అప్పగించడం జరిగింది…
You may also like
సీ ఈ సీ రాజీనామాకు 48 గంటల గడువు… కాక్రోచ్ జనతా పార్టీ
రాజ్యాధికారం సాధన ద్వారా నే దళిత బహుజన కులాల కు విముక్తి ; దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి. కృష్ణ స్వరూప్
కాంగ్రెస్ ప్రభుత్వ 420 హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసింది…
రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలను ప్రారంభించిన జిల్లా అధ్యక్షుడు తీగల తిరుమల గౌడ్…
రైతుల అభ్యున్నతే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్…


