బోనం ఎత్తిన చైర్ పర్సన్ దావ స్వాతి రమేష్ బాబు

బెల్లంపల్లి ఆగస్టు 09(అఖండ భూమి న్యూస్):బోనాల పండుగ సందర్భంగా బెల్లంపల్లి పట్టణం రడగంబాల బస్తీలో స్థానిక వార్డ్ కౌన్సిలర్ దామెర విజయ-శ్రీనివాస్ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా నిర్వహించిన ఆషాడ మాసం బోనాల కార్యక్రమంలో పాల్గొన్న బెల్లంపల్లి మున్సిపల్ చైర్ పర్సన్ దావ స్వాతి-రమేష్ బాబు, అలాగే తోటి కౌన్సిల్ సభ్యులు
స్థానిక మహిళలతో కలిసి స్వయంగా బోనం ఎత్తుకొని ఆలయానికి చేరుకొని అమ్మవారికి బోనం సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది.
ఈ సందర్భంగా బెల్లంపల్లి పట్టణ ప్రజలు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని, నియోజకవర్గంలోని రైతులకు సమృద్ధిగా వర్షాలు కురిసి పంటలు బాగా పండాలని,యువతకు ఉపాధి అవకాశాలు పెరగాలని అమ్మవారిని ప్రార్థించినట్లు తెలిపారు.రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంకటస్వామి నాయకత్వంలో ప్రభుత్వం ప్రజాసేవలో మరింత ముందుకు సాగాలని నియోజకవర్గం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని మున్సిపల్ చైర్ పర్సన్ ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు బండి ప్రభాకర్ యాదవ్,కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు,బస్తీ మహిళలు, తదితరులు పాల్గొన్నారు…


