ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో సమగ్ర అభివృద్ధిలో భాగంగా అత్యవసర సమావేశం

ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో సమగ్ర అభివృద్ధిలో భాగంగా అత్యవసర సమావేశం

బెల్లంపల్లి ఆగస్టు 13(అఖండ భూమి న్యూస్):బెల్లంపల్లి శాసనసభ్యులు,గడ్డం వినోద్ వెంకట స్వామి అధ్యక్షతనగురువారం బెల్లంపల్లి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బెల్లంపల్లి పట్టణ సమగ్ర అభివృద్ధిలో భాగంగా చేపట్టిన రోడ్ల విస్తరణ పనులకు సంబంధించి బెల్లంపల్లి సబ్ కలెక్టర్ మనోజ్ మందమర్రి ఏరియా సింగరేణి జనరల్ మేనేజర్ ఎన్.రాధాకృష్ణ అలాగే ఏజీఎం సంతోష్ కుమార్,బెల్లంపల్లి ఏసీపీ కిరణ్ కుమార్ మరికొందరు సంబంధిత అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో పాల్గొని రోడ్డు విస్తరణకు సంబంధించిన అడ్డంకులు, చేపట్టవలసిన కార్యాచరణ పై సంబంధిత అధికారులకు వివరించిన బెల్లంపల్లి మున్సిపల్ చైర్ పర్సన్ దావ స్వాతి-రమేష్ బాబు,మున్సిపల్ కమిషనర్ తన్నీరు రమేష్,ఈ సందర్బంగా రోడ్డు విస్తరణ పనులలో భాగంగా రహదారికి ఇరువైపులా ఉన్న సింగరేణి సంస్థకు సంబంధించిన విద్యుత్ స్తంభాలను తొలగించాలని జనరల్ మేనేజర్ రాధాకృష్ణ ను కోరడం జరిగింది.అనంతరం పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం వద్ద అదేవిదంగా గోల్ బంగ్లా బస్తి వద్ద సింగరేణికి సంబంధించిన విద్యుత్ స్తంభాలను జిఎంతో కలిసి పరిశీలించడం జరిగింది.అనంతరం బెల్లంపల్లి పట్టణ అభివృద్ధికి సంబంధించి మార్కెట్ ఏరియాలో ఉన్న బంకర్ పక్కన స్థలాన్ని కేటాయించి సహకరించాలని మున్సిపల్ చైర్పర్సన్ సింగరేణి జిఎంను కోరడం జరిగింది. సానుకూలంగా స్పందించి అభివృద్ధికి సహకరిస్తామని హామీ ఇచ్చిన మందమర్రి ఏరియా సింగరేణి జనరల్ మేనేజర్ ఎన్.రాధాకృష్ణకు ఏజీఎం సంతోష్ కుమార్ గార్లకు మున్సిపల్ చైర్ పర్సన్ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసారు.ఈ కార్యక్రమంలో విద్యుత్ శాఖ అధికారులు,సిబ్బంది, సింగరేణి అధికారులు,సిబ్బంది, పలువురు నాయకులు,తదితరులు పాల్గొన్నారు…

Akhand Bhoomi News

error: Content is protected !!