బాలాంజనేయ స్వామి దేవస్థానాన్ని సందర్శించిన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి…

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; ఆగస్టు 8 (అఖండ భూమి న్యూస్);
కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలంలోని కల్పవృక్ష కామధేను అభయారణ్య బాలాంజనేయ స్వామి దేవస్థానాన్ని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి శనివారం సందర్శించారు.
ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, బాలాంజనేయ స్వామివారిని దర్శించుకుని తీర్థ , ప్రసాద ఆశీర్వాదాలు పొందారు. ఆలయ సభ్యులు, భక్తులు ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు.
అనంతరం ఆలయ అభివృద్ధికి సంబంధించిన పలు అంశాలను ఆలయ సభ్యులు గడ్డం చంద్రశేఖర్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. ఆలయానికి అవసరమైన విద్యుత్ సౌకర్యం, నీటి వసతి, ఇతర మౌలిక వసతుల అభివృద్ధికి తనవంతు సహకారం అందిస్తానని ఆయన హామీ ఇచ్చారు.
ఆలయ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలని, భక్తులకు మరింత మెరుగైన సౌకర్యాలు కల్పించేలా కృషి చేయాలని గడ్డం చంద్రశేఖర్ రెడ్డి అన్నారు.
ఈ కార్యక్రమంలో, మున్సిపల్ కౌన్సిలర్, కామారెడ్డి సేవల జిల్లా అధ్యక్షులు గడ్డమీద మహేష్,డిసిసి ఉపాధ్యక్షులు, పంపరి లక్ష్మణ్, కామారెడ్డి నియోజకవర్గం సేవాదళ్ అధ్యక్షులు, మెహర్ బాబా గౌడ్,మాజీ కౌన్సిలర్లు, జమీల్, రంగా రమేష్ గౌడ్, యూత్ సేవాదళ్ అధ్యక్షులు నర్సల్లా మహేష్,బండారి శ్రీకాంత్, పండు శ్రీకాంత్,రాహుల్, శశి, సరుగు సందీప్, చింటూ, యూత్ సభ్యులు,ఆలయ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.


