కామారెడ్డి మున్సిపల్ పై కాంగ్రెస్ జెండా ఎగురవేయడం కాయం..

కామారెడ్డి మున్సిపల్ పై కాంగ్రెస్ జెండా ఎగురవేయడం కాయం..

మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో షబ్బీర్ అలీ గర్జన..

 

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; ఫిబ్రవరి 5 (అఖండ భూమి న్యూస్);

మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో3, 4, 5, 8, 26, 29, 30, 31 వార్డులలో షబ్బీర్ అలీ పర్యటనకు ప్రజలు గురువారం బ్రహ్మరథం పట్టారు.

మహిళలుహారతులతో, యువత గజమాలలతో ఆయనకు ఘనస్వాగతం పలికారు.

ఈ సందర్భంగా షబ్బీర్ అలీ మాట్లాడుతూ.

అందరూ వచ్చి అభివృద్ధి చేస్తామని వాగ్దానాలు చేస్తారు.. కానీ మేము అభివృద్ధి చేసి, చేసిన అభివృద్ధిని చూపించి ఓట్లు అడుగుతున్నాం అన్నారు.

ముఖం చాటేసిన నాయకులకు బుద్ధి చెప్పండి ప్రజలకు పిలుపునిచ్చారు.

ఎన్నికల్లో గెలిచిన తర్వాత రెండున్నర ఏళ్లు ప్రజలకు ముఖం చాటేసిన నాయకులు, మళ్లీ ఇప్పుడు ఓట్ల కోసం వస్తున్నారు.

కేవలం రెచ్చగొట్టే మాటలతో, కుల మతాల మధ్య చిచ్చు పెట్టి ఓట్లు దండుకోవాలని చూస్తున్నారు. అలాంటి వారి పట్ల జాగ్రత్తగా ఉండాలన్నారు.

మానవత్వమే మా మతం:

మనుషులంతా ఒక్కటే. మానవత్వం తర్వాతే మతాలు, కులాలు వస్తాయి.

మనకు కావాల్సింది అభివృద్ధి. కామారెడ్డిని రాష్ట్రంలోనే ఒక రోల్ మోడల్‌గా తీర్చిదిద్దడమే నా లక్ష్యం అన్నారు.

కామారెడ్డి ప్రత్యేక మేనిఫెస్టో ముందుకు వెళ్దాం పట్టణ సమగ్ర అభివృద్ధి కోసం మేము ఒక ప్రత్యేక మేనిఫెస్టోను రూపొందించాం అన్నారు.

ఇది కేవలం కాగితాల మీద ఉండే హామీ కాదు, ప్రతి వార్డుకు ఒక నిర్దిష్టమైన ప్రణాళిక. డ్రైనేజీలు, వీధి దీపాలు, మౌలిక వసతుల కల్పనలో మా అభ్యర్థులు మీకు జవాబుదారీగా ఉంటారు.

నేనే పూచీకత్తు – నేనే బాధ్యత:

మీరు మా అభ్యర్థులను ఆశీర్వదించి గెలిపించండి.

కామారెడ్డి పట్టణ అభివృద్ధికి నేనే పూచీకత్తుగా ఉంటాను. ప్రభుత్వం నుంచి నిధులు తీసుకురావడంలో, పనులను పర్యవేక్షించడంలో నేను ముందుండి నడిపిస్తాను. అభివృద్ధి విషయంలో వెనకడుగు వేసే ప్రసక్తే లేదు.

హస్తం గుర్తుకే మన ఓటు వేయండి ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికీ చేరుతున్నాయి.

ఈ అభివృద్ధి యజ్ఞం ఇలాగే కొనసాగాలంటే, కామారెడ్డి పట్టణం అభివృద్ధి పథంలో దూసుకు పోవాలంటే.చేతి గుర్తుకే మీ ఓటు వేసి మా అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరుతున్నాను అన్నారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు పాల్గొన్నారు.

Akhand Bhoomi News

error: Content is protected !!