కామారెడ్డి మున్సిపల్ ఎన్నికల్లో ప్రఖ్యాతి పార్టీలకు షబ్బీర్ అలీ సవాల్ …

కామారెడ్డి మున్సిపల్ ఎన్నికల్లో ప్రఖ్యాతి పార్టీలకు షబ్బీర్ అలీ సవాల్ …

రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్..

 

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; ఫిబ్రవరి 6 (అఖండ భూమి న్యూస్);

అభివృద్ధి అంటే పారిపోవడమా?

ప్రత్యర్థులు, ప్రస్తుత ఎమ్మెల్యే , మాజీ ఎమ్మెల్యేలకు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడు షబ్బీర్ శుక్రవారం సూటి ప్రశ్నలు వేశారు.

మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా కామారెడ్డి పట్టణంలోని 18, 41, 42, 43, 48, 49 వార్డుల్లో ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ ఉధృతమైన ప్రచారం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన చేసిన ప్రసంగం కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపడమే కాకుండా, ప్రత్యర్థి పార్టీలపై విమర్శల బాణాలు ఎక్కు పెట్టారు.

దమ్ముంటే సమాధానం చెప్పండి ఎమ్మెల్యేగా గెలిచిన ఈ రెండున్నర ఏళ్లలో కామారెడ్డికి నువ్వు చేసిన అభివృద్ధి ఏంటో చెప్పి ఓట్లు అడిగే దమ్ముందా?

ప్రజలు నిలదీస్తుంటే సమాధానం లేక తప్పించుకు తిరుగుతున్నారు.

అభివృద్ధి అంటే ఏంటి?

రోడ్లు వేయడం, డ్రైనేజీలు కట్టడం, నీటి సరఫరా చేయడం, పట్టణ పారిశుద్ధ్యం, స్ట్రీట్ లైట్లు వేయడం అభివృద్ధి కాదట! మరి ఇంకేది అభివృద్ధి? ఆయన ప్రశ్నించారు.

ఎన్నికల్లో గెలిచి ప్రజలకు కనపడకుండా పారిపోవడమే మీ దృష్టిలో అభివృద్ధి నా

మేము ఈ గడ్డపై చేసిన అభివృద్ధిని కళ్ళకు కట్టినట్లు చూపిస్తున్నాం. ఆ ధైర్యంతోనే ప్రజల ముందుకు వచ్చి ఓట్లు అడుగుతున్నాం అని అన్నారు.

అవినీతిపై సవాల్: “కరప్షన్ గురించి మాట్లాడే నైతిక హక్కు మీకు లేదు. మీ గత చరిత్ర అంతా అవినీతిమయం.

దాన్ని నిరూపించే బాధ్యత మాది అని అన్నారు.

నిజాయితీకి నిలువుటద్దం: షబ్బీర్ అలీ గారి హామీ

సాధ్యమైన పనులకి హామీ ఇస్తా ,

అమలు చేసి చూపిస్తా ఆయన అన్నారు.

కాంగ్రెస్ అభ్యర్థులు గెలిచిన తర్వాత ఎవరైనా అవినీతికి పాల్పడితే, వెంటనే నా దృష్టికి తీసుకురండి. వారిని ఇందిరా గాంధీ చౌరస్తా వద్ద నిలబెట్టి, పార్టీ నుండి సస్పెండ్ చేయడమే కాకుండా కఠిన చర్యలు తీసుకుంటానని ప్రజల సాక్షిగా మాట ఇస్తున్నాను అని అన్నారు.

రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం పేదల సంక్షేమమే ధ్యేయంగా అమలు చేస్తున్నాం అన్నారు.

ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం.

గృహ జ్యోతి: ప్రతి ఇంటికి 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్.

ఇందిరమ్మ ఇండ్లు: ఇల్లు లేని పేదలకు ఇంటి నిర్మాణానికి ₹5 లక్షల ఆర్థిక సాయం చేస్తున్నట్లు తెలిపారు.

కామారెడ్డి పట్టణ సమగ్ర అభివృద్ధి కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం. హస్తం గుర్తుకు ఓటు వేసి మన అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించండి” అని షబ్బీర్ అలీ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఆయా కాలనీలా ఓటర్లు పాల్గొన్నారు.

Akhand Bhoomi News

error: Content is protected !!