థాయ్‌లాండ్‌లో తెలంగాణ క్రీడాకారుల ప్రతిభ

మూడు పతకాలతో స్వదేశానికి.. బెల్లంపల్లిలో ఘన స్వాగతం
బెల్లంపల్లి,ఆగస్టు7(అఖండ భామీ న్యూస్):థాయ్‌లాండ్‌లోని పటాయా నగరంలో జూలై 31 నుంచి ఆగస్టు 4 వరకు వరల్డ్ టైక్వాండో ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన 9వ హీరోస్ ఇంటర్నేషనల్ టైక్వాండో ఛాంపియన్‌షిప్‌లో భారత జట్టు తరఫున పోటీపడిన తెలంగాణ క్రీడాకారులు మూడు పతకాలు సాధించారు.ప్రమోద్ కుమార్ ప్రధాన్ సిల్వర్ మెడల్, లాస్య దలాయ్,గోగర్ల శ్రీనిత్ సాయి బ్రాంజ్ మెడల్స్ గెలుచుకున్నట్లు తెలంగాణ రాష్ట్ర టైక్వాండో అసోసియేషన్ టెక్నికల్ కమిటీ చైర్మన్ మాస్టర్ జిల్లపల్లి వెంకటస్వామి తెలిపారు.విజేతలకు శిక్షణ అందించిన కోచ్ జంగపల్లి అజయ్‌ను తెలంగాణ రాష్ట్ర టైక్వాండో అసోసియేషన్ అధ్యక్షుడు మూట శ్రీనివాస్, కార్యదర్శి కురువ శ్రీహరి, ఖజాంచి సంతోష్‌తో పాటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా టైక్వాండో అసోసియేషన్ అధ్యక్షుడు బుచ్చి రామారావు,కార్యదర్శి జిల్లపల్లి వెంకటస్వామి,ఖజాంచి సుధాకర్ అభినందించారు.పతకాలతో స్వదేశానికి చేరుకున్న విజేతలకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా టైక్వాండో అసోసియేషన్ ఆధ్వర్యంలో బెల్లంపల్లిలో ఘన స్వాగతం లభించింది. భాజాభజంత్రీలు, బాణసంచా మధ్య భారీ విజయోత్సవ ఊరేగింపు నిర్వహించి క్రీడాకారులను సన్మానించారు. ఈ సందర్భంగా క్రీడాభిమానులు,శిక్షకులు, అసోసియేషన్ ప్రతినిధులు విజేతలకు శుభాకాంక్షలు తెలియజేశారు….
You may also like
రాజ్యాధికారం సాధన ద్వారా నే దళిత బహుజన కులాల కు విముక్తి ; దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి. కృష్ణ స్వరూప్
కాంగ్రెస్ ప్రభుత్వ 420 హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసింది…
రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలను ప్రారంభించిన జిల్లా అధ్యక్షుడు తీగల తిరుమల గౌడ్…
రైతుల అభ్యున్నతే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్…
దోమకొండలో ఆడుదాం క్రీడా దినోత్సవ వేడుకలు…


