నేషనల్ మినిస్ట్రీట్యూట్ ను సందర్శించిన తెలంగాణ విద్యాలయం దక్షిణ ప్రాంగణం విద్యార్థులు…

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; ఫిబ్రవరి 6 (అఖండ భూమి న్యూస్
హైదరాబాదులోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ ది ఎంపవర్‌మెంట్ ఆఫ్ పర్సన్స్ విత్ ఇంటెలెక్చువల్ డిజబిలిటీస్ (ఎన్ ఈ పి ఐ డి) ని తెలంగాణ విశ్వవిద్యాలయం దక్షిణ ప్రాంగణం సోషల్ వర్క్ విభాగం విద్యార్థులు గురువారం సందర్శించారు. క్షేత్రస్థాయి పర్యటనలో భాగంగా విద్యార్థులకు సంస్థ కార్యకలాపాలను తెలియజేయడానికి సందర్శించినట్లు అధ్యాపకురాలు డా.రాజేశ్వరి తెలిపారు. ఆ సంస్థ నిర్వాహకులు విద్యార్థులతో మాట్లాడుతూ..మేధోపరమైన వైకల్యాలున్న వ్యక్తుల కోసం ఈ సంస్థ పని చేస్తుందని, వైద్య సేవలు, ప్రత్యేక విద్య, ఆక్యుపేషనల్ థెరపీ, ఫిజియోథెరపీ, స్పీచ్ అండ్ ఆడియోలజీ మరియు హైడ్రోథెరపీ లాంటి సేవలను సంస్థ అందిస్తున్నట్లు వివరించారు. 18 ఏళ్లు పైబడిన వారికి వృత్తి విద్యా శిక్షణ, ఉద్యోగ అవకాశాల కల్పనపై దృష్టి పెడుతుందని, 0-6 ఏళ్ల లోపు పిల్లల్లో ఎదుగుదల లోపాలను గుర్తించి, తగిన చికిత్సలను ఈ సంస్థ అందిస్తుందని తెలిపారు. ఈ వైకల్య రంగంలో నిపుణులను తయారు చేయడం కోసం ప్రత్యేక కోర్సులను సైతం అందిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. పూర్తిగా భారతదేశ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఈ సంస్థ కార్యకలాపాలు నిర్వహిస్తుందని పేర్కొన్నారు. సోషల్ వర్క్ విద్యనభ్యసిస్తున్న విద్యార్థులు సంస్థ కార్యకలాపాల్లో పాలుపంచుకోవచ్చని, సోషల్ వర్క్ విద్యార్థుల ప్రాముఖ్యత ఈ రంగంలో అత్యవసరమని వివరించారు. సంస్థ ప్రాధాన్యత తీరు, సంస్థ నెలకొల్పిన వివరాలను డాక్టర్ గోపి, డాక్టర్ శ్రీనివాసులు, విద్యార్థులకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సోషల్ వర్క్ విభాగం అధ్యాపకులు డా.యాలాద్రి, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.


