మోసపూరిత మాటలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ సర్కార్ : మాజీ మంత్రి హరీష్ రావు
బెల్లంపల్లి పిబ్రవరి 06(అఖండ భూమి న్యూస్):మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి 34 వార్డ్ ల మున్సిపాలిటీ ఎన్నికలల్లో భాగంగా శుక్రవారం బజార్ ఏరియా కాంటా చౌరాస్తాలో బీ ఆర్ ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ఆధ్వర్యంలో గొప్ప బహిరంగ సభ నిర్వహించారు.ఈ బహిరంగ సభకు ముఖ్య అతిధులుగా మాజీ మంత్రి హరీష్ రావు హాజరయ్యారు.ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ… బెల్లంపల్లిలో గత ఎమ్మెల్యే ఎన్నికల్లో ప్రజలకు ఎన్నో అబద్దపు హామీలు ఇచ్చి గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పాలని ప్రజలకు పిలుపునిచ్చారు.మన తెలంగాణ ప్రభుత్వం ఉన్నప్పుడు బెల్లంపల్లిలో ఎన్నో అభివృద్ధి పనులు మన బీ ఆర్ ఎస్ పార్టీ చేసిందన్నారు. ఈ నెల 11న జరగబోయే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలు బుద్దిచెప్పాలని అయన కోరారు.ఈ సభలో బీ ఆర్ ఎస్ నాయకులు కార్యకర్తలు, అభిమానులు, బీ ఆర్ ఎస్ అభ్యర్థులు తదితరులు ఉన్నారు…



