అహంకారం వీడితేనే అభివృద్ధి సాధ్యం…
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; ఫిబ్రవరి 07 (అఖండ భూమి న్యూస్);
కామారెడ్డిలో కాంగ్రెస్ ఎన్నికల ప్రచార భేరి షబ్బీర్ అలీ,
అజారుద్దీన్ బిజెపి బిఆర్ఎస్ పార్టీల పై ధ్వజం ఎత్తారు.
ఈ ప్రచారంలో మహిళా కమిషన్ చైర్ పర్సన్ లు పాల్గొని మాట్లాడారు.
పట్టణంలోని 19, 20, 21, 22, 23, 24, 25 వార్డులలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల విజయానికి మద్దతుగా రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ , మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి మహమ్మద్ అజహారుద్దీన్ ఉధృత ప్రచారం నిర్వహించారు.
ఇంటింటికీ తిరుగుతూ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్న నాయకులు, హస్తం గుర్తుకు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు.
షబ్బీర్ అలీ ఈ సందర్భంగా మాట్లాడుతూ .
అహంకారం వీడితేనే అభివృద్ధి సాధ్యం.స్థానిక ఎమ్మెల్యేపై నిప్పులు చెరిగారు.
ఎమ్మెల్యే గెలిచినప్పటి నుండి ఈ ప్రాంతానికి చేసిందేమీ లేదు అని అన్నారు.
గతంలో ఏమీ చేయని వ్యక్తి, రేపు చేస్తాడనే నమ్మకం మాకు లేదు, ప్రజలకు అసలే లేదు.
అధికార గర్వం ఇద్దరు ముఖ్యమంత్రులను ఓడించానని చెప్పుకోవడం తప్ప, కామారెడ్డి కోసం ఆయన సాధించిన ఘనత ఒక్కటీ లేదు అన్నారు.
అధికార అహం నెత్తికెక్కితే చిన్న, పెద్ద అనే వ్యత్యాసం ఉండదు. కేసీఆర్ అంతటి వాడే తన అహంకారంతో నేడు కనుమరుగయ్యే పరిస్థితి వచ్చిందని గుర్తుంచుకోవాలి అన్నారు.
ప్రజా సేవకులే గెలవాలి ఎన్నికల్లో గెలిచే అభ్యర్థులు మృదు స్వభావులై ఉండాలన్నారు.
వార్డులోని ప్రతి సమస్యను తమ ఇంటి సమస్యగా భావించి పరిష్కరించే వారికే ప్రజలు పట్టం కట్టాలనీ పిలుపునిచ్చారు.
అభివృద్ధికి ఓటు వేయండి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. ఇతర పార్టీల అభ్యర్థులు గెలిస్తే సమన్వయ లోపంతో అభివృద్ధి కుంటుపడుతుందినీ ఉన్నారు.
ప్రతి ఒక్కరూ ఆలోచించి, అభివృద్ధిని కోరుతూ కాంగ్రెస్‌కు ఓటు వేయాలన్నారు.
రేవంత్ రెడ్డి పాలనలో తెలంగాణ స్వర్ణయుగంగా మారిందన్నారు.
మంత్రి మహమ్మద్ అజహారుద్దీన్ గారు మాట్లాడుతూ.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలను వివరించారు.
తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యం నడుస్తోంది.
రేవంత్ రెడ్డి ఇచ్చిన ఆరు గ్యారంటీలను యుద్ధ ప్రాతిపదికన అమలు చేస్తున్నారు.
మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రూ. 500లకే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ వంటి పథకాలు సామాన్యుల జీవితాల్లో వెలుగులు నింపుతున్నాయి.
రైతు భరోసా రైతులకు ఎకరాకు రూ. 6,000 చొప్పున పెట్టుబడి సాయం అందిస్తూ వ్యవసాయాన్ని పండుగ చేస్తున్నారు.
ఉద్యోగ నియామకాలు: గత రెండేళ్లలో దాదాపు 51,000 ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసి నిరుద్యోగుల ఆశాజ్యోతిగా నిలిచారు.
మైనారిటీ సంక్షేమం కోసం మైనారిటీల విద్య, ఆర్థికాభివృద్ధి కోసం ప్రత్యేక నిధులు కేటాయించి, వారిని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారు.
అభివృద్ధి కొనసాగాలంటే స్థానిక సంస్థల్లో కూడా కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలిఅని అజారుద్దీన్ ప్రజలకు పిలుపునిచ్చారు.
నేరేళ్ల శారద గారు మాట్లాడుతూ
నాడు ఇందిరమ్మ పాలనలో మహిళలకు అండగా ఉన్న కాంగ్రెస్ పార్టీ,
నేడు తెలంగాణలో మళ్ళీ అభయహస్తం
గ్యారంటీల ద్వారా మహిళా సాధికారతకు బాటలు వేస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మన ప్రభుత్వం కేవలం మాటలకే పరిమితం కాకుండా,
చేతల్లో మహిళల ఆర్థిక, సామాజిక భద్రతను చాటుతోంది. అన్నారు
ఈ కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్ అభ్యర్థులు, స్థానిక నాయకులు మరియు భారీ సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.
You may also like
దేసేయిబీడీ కంపెనీ యజమాని నితిన్ బాయ్ మృతికి సంతాపం
డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల నుంచి పోలింగ్ కేంద్రాలకు తరలుతున్న ఎన్నికల సామగ్రిని దగ్గరుండి పరిశీలించిన జిల్లా కలెక్టర్…
1.25 కోట్ల మంది హిందువులు పోరాడాలని నిర్ణయించుకుంటే…!: ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు..!
రైతు భరోసా, పోలింగ్ కు ముందే నిధుల జమ – ఒక్కొక్కరి ఖాతాలో రూ 6 వేలు..!?.
పబ్జి ఆడుతుండగా 300 దాటిన బిపి మెదడు నరాలు చిట్లి మృతి..!


