పోలీసుల ఘన నివాళి…

మాజీ ముఖ్యమంత్రి రోశయ్య జయంతి సందర్భంగా కామారెడ్డి జిల్లా పోలీస్ కార్యాలయంలో పోలీసుల ఘన నివాళి…

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జూలై 4 (అఖండ భూమి న్యూస్);

కామారెడ్డి జిల్లా ఎస్పీ యం.. రాజేష్ చంద్ర, ఐపీఎస్ ఆదేశాల మేరకు, జిల్లా పోలీసు కార్యాలయంలో మాజీ ఉమ్మడి ఆంద్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి మరియు తమిళనాడు మాజీ గవర్నర్ కొణిజేటి రోశయ్య జయంతిని పురస్కరించుకుని ఘనంగా నివాళులు అర్పించారు. జిల్లా అదనపు ఎస్పీ కె. నరసింహరెడ్డి రోశయ్య చిత్రపటానికి పూలమాల వేసి పుష్పాంజలి ఘటించారు.

ఈ సందర్భంగా అదనపు ఎస్పీ నరసింహారెడ్డి మాట్లాడుతూ

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య పరిపాలన పట్ల చూపిన శ్రద్ధ, పని పట్ల నిబద్ధత, ఆయన వ్యక్తిత్వానికి మారుపేరులుగా నిలిచినవి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా సేవలందించడంతో పాటు, ప్రభుత్వంలో 16 సార్లు ఆర్థిక శాఖ మంత్రిగా బడ్జెట్ ప్రవేశపెట్టి అరుదైన ఘనతను సాధించారు.

రోశయ్య సుదీర్ఘకాలంగా ప్రజాసేవలో నిమగ్నమై, తన దేశసేవ, పరిపాలనా ప్రతిభ, నిష్కళంక రాజకీయ జీవితం ద్వారా ప్రజల మన్ననలు పొందారు. రాజకీయాల్లో ఉన్నతమైన నైతిక విలువలకు నిలయంగా నిలిచారు. ఆయన సేవా తత్వం, ప్రజల పట్లకలిగిన కట్టుబాటు ప్రతి ప్రభుత్వాధికారికి ప్రేరణగా నిలుస్తుంది.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా తన పదవికి రాజీనామా చేసిన అనంతరం తమిళనాడు రాష్ట్ర గవర్నర్‌గా కూడా రోశయ్య విశిష్ట సేవలు అందించారని గుర్తు చేశారు. ఆయన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Akhand Bhoomi News

error: Content is protected !!