గుండెపోటుతో హఠాన్మరణం చెందిన అధ్యాపకుడు డా.రమేష్ కు ఘన నివాళి…

గుండెపోటుతో హఠాన్మరణం చెందిన అధ్యాపకుడు డా.రమేష్ కు ఘన నివాళి…

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; సెప్టెంబర్ 15 (అఖండ భూమి న్యూస్) గత శనివారం గుండెపోటుతో హఠాన్మరణం చెందిన సౌత్ క్యాంపస్ హిస్టరీ విభాగం అధ్యాపకులు డా.రమేష్ కు సౌత్ క్యాంపస్ లో సంతాప సభ సోమవారం నిర్వహించి ఘన నివాళి అర్పించారు.

ఈ సందర్భంగా సౌత్ క్యాంపస్ ప్రిన్సిపల్ డాక్టర్ సుధాకర్ గౌడ్ మాట్లాడుతూ అధ్యాపకుడు రమేష్ మరణం అందరినీ కలచివేసిందని అన్నారు.హిస్టరీ విభాగం ఏర్పడిన దగ్గరై నుండి డిపార్ట్మెంట్ అభివృద్ధి కోసం చాలా కష్టపడ్డ వ్యక్తి రమేష్ సర్ అని అన్నారు. అందరితో కలుపుగోలుగా ఉంటూ విద్యార్థులకు నిరంతరం అందుబాటులో ఉండేవారు అన్నారు. దోమకొండ ఫోర్ట్ లో చరిత్ర విభాగం తో కలిసి చేసిన వర్క్ షాప్ విజయవంతం కోసం చాలా కష్టపడి పని చేశాడని గుర్తు చేశారు. పరిశోధనలో ముందుండేవాడని,విద్యార్థులను పరిశోధనలో ప్రోత్సహించేవాడని అన్నారు. అలాంటి వ్యక్తి ఇంత హఠాత్తుగా మరణించడం బాధాకర అన్నారు. ఆయన కుటుంబాన్ని తగిన విధంగా ఆదుకొనేలా కృషి చేస్తామని అన్నారు.

చరిత్ర విభాగం అధ్యక్షులు డా.అంజయ్య బందెల మాట్లాడుతూ చరిత్ర పరిశోధనలో రమేష్ సార్ చాలా ఉన్నతంగా ఎదిగారని,తన విద్యార్థులను అటువైపు చాలా ప్రోత్సహించారని అన్నారు. నిరంతరం విద్యార్థులతో పరిశోధన గురి చి చర్చించేవాడని అన్నారు. మృదు స్వభావి ,అందరితో చాలా మర్యాదగా నడుచుకొనేవారని గుర్తు చేసుకున్నారు. మానసిక వత్తిడి వల్ల ఇలాంటి మరణాలు సంభవిస్తున్నాయి కాబట్టి అందరూ మానసిక వత్తిడిని తట్టుకునేలా తయారుకావాలని అన్నారు. ఆంటీ సమస్యలున్నా చర్చించుకోవాలని పరిష్కరించుకోవాలి కానీ ఆరోగ్యం పడిచేసుకోవద్దని విద్యార్థులకు సూచించారు. చరిత్ర విభాగానికి,సౌత్ క్యాంపస్ కి ఆయన చేసి ఆ సేవలు మరువలేనివి అన్నారు.

విద్యార్థులు,అధ్యాపకులు, ప్రధాన క్యాంపస్ డిచ్పలీ నుంచి వచ్చిన అధ్యాపకులు ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకొని ఆయనకు నివాళులు అర్పించారు. ఎవరికీ ఇలాంటి పరిస్థితి రావొద్దని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో హాస్టల్ వార్డెన్ డా.యాలాద్రి, విమెన్స్ సెల్ అసిస్టెంట్ డైరెక్టర్ వైశాలి apro డా.సరిత పిట్ల, అధ్యాపకులుడా.మోహన్ బాబు,డా.ప్రతిజ్ఞ,డా. సబిత, ఏపీ ఆర్ ఓ డా.సరిత పిట్ల ,డా.s.నారాయణ,డా.నర్సయ్య,డా.రమాదేవి, శ్రీకాంత్ ,దిలీప్, డా.ప్రసన్న కుమారి, డా.తాహిర్,డా.రఘువీర్,డా.అలోక్,డా. ఇంద్రకరణ్,డా. శ్రీకాంత్,డా.శ్రీనివాస్,పోతన్న ,డా.కనకయ్య,డా.కిషన్,డా.సునీల్,డా.ఆఫ్రీన్, శ్రీనివాస్ మరియు విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Akhand Bhoomi News

error: Content is protected !!