దొంగలు పడ్డాక ఆరు నెలలకు కుక్కలు మొరిగినట్లుగా ఉంది కేంద్ర ప్రభుత్వ తీరు…

*దొంగలు పడ్డాక ఆరు నెలలకు కుక్కలు మొరిగినట్లుగా ఉంది కేంద్ర ప్రభుత్వ తీరు…

సిపిఎం జిల్లా కార్యదర్శి చంద్రశేఖర్..

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; అక్టోబర్ 8 (అఖండ భూమి న్యూస్);

కామారెడ్డి జిల్లాలో ఆగస్టు 26, 27 తేదీలలో వచ్చిన భారీ వరదల వల్ల జాతీయ రహదారులతో సహా మార్గాలన్నీ ధ్వంసం అయ్యాయని వంతెనలు చెక్ డ్యాములు కొట్టుకుపోయి పల్లెలు పట్టణాలు అంటూ తేడా లేకుండా జలదిగ్బంధంలో చిక్కుకు పోయిందని కామారెడ్డి జిల్లా సిపిఎం కార్యదర్శి చంద్రశేఖర్ అన్నారు. బుధవారం కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఈ సందర్భంగా మాట్లాడుతూ. రైతుల కష్టార్జిత మంత వర్షార్పణమై నీటిలో కొట్టుకుపోయిందని అన్నారు
రెండవ వైపు జలదిగ్బంధంలో వరద ఉధృతిలో చిక్కుకున్న గ్రామాలు పట్టణాల్లోని నివాస ప్రాంతాల్లో ఉన్న ప్రజలు రోజుల తరబడి విద్యుత్ లేక నీళ్లు లేక తిండి ఎన్నో అవస్థలు పడ్డారని అన్నారు.
ప్రధానంగా జిల్లా కేంద్రంలోని జి ఆర్ కాలనీ కౌండిన్య కాలనీ హౌసింగ్ బోర్డ్ కాలనీ బతుకమ్మ కుంట టీచర్స్ కాలనీ గాంధీనగర్ లాంటి నివాస ప్రాంతాలు వరద నీటితో నిండిపోయి ఇండ్లలో ఉన్న ఎలక్ట్రిక్ వస్తువులతో సహా అన్ని రకాల వస్తువులన్నీ చెడిపోయి పిల్లల బుక్స్ పనికిరాకుండా పోయి ఒక్కొక్క కుటుంబానికి 10 నుండి 15 లక్షల నష్టం జరిగిందనీ అన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి స్పందించిన తీరు బాగున్న బాధితులకు నష్ట పరిహారం అందించడంలో విఫలమైందని అన్నారు
ఇక కేంద్ర బిజెపి ప్రభుత్వం స్పందించిన తీరు కామారెడ్డి ప్రజలను అవమానపరిచేదిగా ఉందని అన్నారు ఇప్పటికైనా సందర్శనకు వచ్చిన కేంద్ర బృందానికి ధన్యవాదాలు తెలుపుతున్నామని అలాగే పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు 40000 చొప్పున వరదతో ఇంటి సామాన్ నష్టపోయిన ప్రజలకు కుటుంబానికి మినిమం 10 లక్షల చొప్పున అందరికీ తగిన నష్టపరిహారాన్ని వెంటనే ప్రకటించి అందించాలని సిపిఎం పార్టీ జిల్లా కమిటీగా డిమాండ్ చేస్తున్నాము
జిల్లా సెక్రటేరియట్ సభ్యులు వెంకట్ గౌడ్ మోతీరామ్ నాయక్ కొత్త నరసింహులు ఉదం అరుణ్ కుమార్ పాల్గొన్నారు.

Akhand Bhoomi News

error: Content is protected !!