పేదల సంక్షేమమే నా ధ్యేయం – ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్…

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; నవంబర్ 24 (అఖండ భూమి న్యూస్);
కామారెడ్డి జిల్లా రాజంపేట మండలం కొండాపూర్ గ్రామంలోని వెంకటమ్మ & ప్రభు కుటుంబ పరిస్థితి చూసి ఆ *కుటుంబానికి ఇచ్చిన మాట ప్రకారం ఎమ్మెల్యే మదన్ మోహన్ ప్రజా పాలన,ప్రజా ప్రభుత్వంలో ఇందిరమ్మ ఇండ్ల పథకం కింద ఇల్లును మంజూరూ చేయించారు, సకాలంలో ఇంటి నిర్మాణం పూర్తి చేసుకున్న వెంకటమ్మ & ప్రభు దంపతులు గృహప్రవేశానికి *ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే మదన్ మోహన్ ఆహ్వానించారు. ఆ ఆహ్వానం మేరకు గృహప్రవేశ కార్యక్రమానికి ఎమ్మెల్యే మదన్ మోహన్ హాజరై ఆ దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే మదన్ మోహన్ మాట్లాడుతూ, “ ఇల్లు లేని ప్రతి అర్హుడికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయడం నా కల. మాన నియోజకవర్గానికి మొత్తం 3500 ఇళ్లు మంజూరయ్యాయి. వేగంగా పనులు పూర్తి చేస్తున్నాం” అని అన్నారు.ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో గ్రామ పంచాయతీ కార్యదర్శులు, ఎంపీడీవో ఇతర ప్రభుత్వ అధికారుల కృషిని ఆయన అభినందించారు.
ఈ సందర్భంగా లబ్ధిదారులు మాట్లాడుతూ. గత 15 సంవత్సరాలుగా అద్దె ఇళ్లలో జీవనం సాగిస్తున్న తమ కుటుంబానికి *ఎమ్మెల్యే మదన్ మోహన్ గారి కృషి వల్ల ఇందిరమ్మ ఇల్లు మంజూరైందని, తాము కన్నా కళ నిజమైందని ఈ సహాయం తమ కుటుంబానికి ఎంతో ఊరటనిచ్చిందని తెలిపారు. తమకు ఇల్లు మంజూరు చేసినందుకు జీవితాంతం *ఎమ్మెల్యే మదన్ మోహన్ గారికి, సీఎం శ్రీ రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలిపారు.
You may also like
దోమకొండ శివరాం మందిర్ ఆలయంలో ఎమ్మెల్యే కాటిపల్లి సహకారంతో రథశాల రేకుల షెడ్డు ఏర్పాటు…
నటుడు ప్రకాష్ రాజ్‌పై నాన్-బెయిలబుల్ వారెంట్ జారీ…
దోమకొండ ఎంపీడీవో ని సన్మానించిన సీతారాం మధు ముదిరాజ్…
దోమకొండ లో మండల ఉపసర్పంచ్ ఫోరం అధ్యక్షుడు గా సిరిగాధ మహేందర్ గౌడ్
ప్రభుత్వం ప్రోత్సహిస్తున్న 7 వరి రకాలను సాగు చేసి బోనస్ పొందాలి…


