మందు బాబులు అలర్ట్.. లిక్కర్‌ అలర్జీ ముప్పు.. హైదరాబాద్‌లో తొలి కేసు..

 

 

సంతోషం వచ్చినా.. బాధ కలిగినా.. ప్రమోషన్‌ వచ్చినా.. డిమోషన్‌ వచ్చినా.. బంధువులు వచ్చినా.. ఫ్రెండ్స్‌ కలిసినా.. ఇలా ఏది జరిగినా..

వచ్చేది ఒక్కటే మాట.. అదే మందు వేద్దామా? అని అంతలా చాలా మంది లిక్కర్‌లో మునిగితేలుతున్నారు.. అయితే, మందు బాబులు అలర్ట్ కావాల్సిన సమయం వచ్చేసింది.. ఇప్పటి వరకు లిక్కర్‌తో లివర్‌ చెడిపోతుందని మాత్రమే అనుకొనేవాళ్లు.. కానీ, ఇప్పుడో షాకింగ్ వ్యవహారం వెలుగు చూసింది.. హైదరాబాద్‌లో వెలుగు చూసిన అరుదైన కేసు.. మందు బాబులు ఒక్కసారి ఉలిక్కిపడేలా చేస్తోంది.. ఇది ఎందరిలో ఉంది.. ఎలా వస్తుంది.. ఎలాంటి రియాక్షన్‌ ఉంటుంది? ఎలా గుర్తించాలి? లాంటే అనేక సందేహాలను తెరపైకి తెచ్చింది..

మందు తాగేవారిలో ఎర్రటి దద్దుర్లతో ‘లిక్కర్‌ అలర్జీ’ అనే అరుదైన వ్యాధి సోకుతుందని చాలా మందికి ఇప్పటి వరకు తెలిసి ఉండదు.. కానీ, దాని గురించి తెలుసుకోవాల్సిన సమయం వచ్చేంది.. ఎందుకంటే మనదేశంలో లిక్కర్‌ అలర్జీని ఇటీవల తొలిసారి హైదరాబాద్‌లోనే గుర్తించారు. ఆగ్రా నుంచి వచ్చిన జాన్‌ అనే 36 ఏళ్ల యువకుడికి ఈ వ్యాధిని గుర్తించారు.. జాన్‌కు ఈ వ్యాధి సోకినట్టు హైదరాబాద్‌లోని అశ్విని అలర్జీ సెంటర్‌ వైద్యులు తేల్చారు.. ఇది చాలా అరుదైన వ్యాధి అని, మద్యం సేవించడం వల్ల కొంతమంది శరీరంలో అలర్జీకి సంబంధించిన మార్పులు కనిపిస్తాయంటున్నారు డాక్టర్‌ వ్యాకరణం నాగేశ్వర్‌.. అయితే, చాలా అరుదైన కేసు.. ప్రపంచంలోనే ఈ తరహా కేసులు వందకు మించి ఉండవని పేర్కొన్నారు..

Akhand Bhoomi News

error: Content is protected !!