దోమకొండలో ఘనంగా బక్రీద్ పండుగ వేడుకలు…
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; మే 28 (అఖండ భూమి న్యూస్);
కామారెడ్డి జిల్లా దోమకొండ మండల కేంద్రంలో బక్రీద్ పండగ వేడుకలు గురువారం ఘనంగా నిర్వహించారు. ముస్లిం సోదరులు భక్తిశ్రద్ధలతో ఈద్గాల వద్దకు చేరుకొని ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం ఒకరికొకరు ఈద్ ముబారక్ అంటూ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. దోమకొండ లో హిందువులు తో కలిసి ముస్లిం సోదరులు ఈద్ ముబారక్ తెలుపుతూ కరచాలనం చేశారు. అనంతరం అందరికీ ఆహ్వానించి తీపి పదార్థాలను అందించారు. ఈ కార్యక్రమంలో ఐరేని నరసయ్య , అనంతరెడ్డి, ఆశ బోయిన శ్రీనివాస్ , తీగల తిరుమల గౌడ్, ఆబ్రబోయిన స్వామి, అండెం శంకర్ రెడ్డి , నల్లపు శ్రీనివాస్ , సీతారాం మధు, బొమ్మర్ శ్రీనివాస్ ,కదిరే గోపాల్ రెడ్డి, ఆబ్రబోయిన రాజేందర్ , అప్పుడు అబ్రబోయిన రాజు, మల్లేష్ యాదవ్, షమ్మీ, నహిం, కాంగ్రెస్ పార్టీ నాయకులతో పాటు టిఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
You may also like
సీ ఈ సీ రాజీనామాకు 48 గంటల గడువు… కాక్రోచ్ జనతా పార్టీ
రాజ్యాధికారం సాధన ద్వారా నే దళిత బహుజన కులాల కు విముక్తి ; దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి. కృష్ణ స్వరూప్
కాంగ్రెస్ ప్రభుత్వ 420 హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసింది…
రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలను ప్రారంభించిన జిల్లా అధ్యక్షుడు తీగల తిరుమల గౌడ్…
రైతుల అభ్యున్నతే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్…


