*దశాబ్దాల పోరాటానికి మద్దతు ఇవ్వాలి…

*దశాబ్దాల పోరాటానికి మద్దతు ఇవ్వాలి…

జిల్లా అధ్యక్షులు

డాక్టర్ భట్టు విఠల్ ముదిరాజ్..

ముదిరాజుల బీసీ ఏ ఉద్యమానికి నా మద్దతు..

సామాజిక న్యాయానికి కట్టుబడి ఉన్నా

పద్మశ్రీ మంద కృష్ణ మాదిగ..

 

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జూలై 11 (అఖండ భూమి న్యూస్);

ముదిరాజ్ జాతి దశాబ్దాల బీసీ ఏ ఉద్యమానికి సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు పద్మశ్రీ మంద కృష్ణ మాదిగ స్పష్టం చేశారు. శనివారం హైదరాబాద్ లోని తన కార్యాలయం లో కలిసిన కామారెడ్డి ముదిరాజ్ మహాసభ జిల్లా అధ్యక్షులు డాక్టర్ భట్టు విఠల్ ముదిరాజ్, జిల్లా ఉపాధ్యక్షులు తూర్పు రాజు ముదిరాజ్,ఉద్యోగుల సంఘం జిల్లా కన్వీనర్ బాలకిషన్ ముదిరాజ్ రామారెడ్డి మండల కార్యదర్శి ఆంజనేయులు ముదిరాజ్ కలిసి మద్దతు కోరారు.

జిల్లా అధ్యక్షులు డాక్టర్ భట్టు విఠల్ ముదిరాజ్ మాట్లాడుతూ దశాబ్దాలుగా ముదిరాజ్ జాతి నాయకులు యువత, మహిళలను రాజకీయ నాయకులు మోసం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అట్టడుగు స్థాయిలో ముదిరాజ్ జాతి జీవనం సాగించి, బతుకు దెరువు లేక చిన్నాభిన్నమై కుటుంబాలు దొరికిన పనిని చేసుకొని పొట్టపోసుకుంటున్న స్థితిని గ్రామాలలో చూశానని మంద కృష్ణ మాదిగ అన్నారు

రాజంగబద్ధమైన హక్కులు లేకుండా శాశ్వతమైన పరిష్కారం కోసం ప్రభుత్వం ప్రయత్నం చేయకపోవడం వల్లనే కులాలు సామాజిక న్యాయం కోసం కోట్లాడుతున్నయని ఆయన అన్నారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు డాక్టర్ భట్టు విఠల్ ముదిరాజ్ మాట్లాడుతూ

3దశాబ్దాల మీ ఉద్యమంతో వర్గీకరణ సాధించారని , మీ అనుభవాలతో ముదిరాజ్ జాతి ఉద్యమానికి మద్దతు ఇవ్వాలని కోరినట్లు తెలిపారు .

సామాజిక న్యాయం, రాజకీయ వాటా, ఆర్థిక విద్య , ఉపాధి అవకాశాలు కోసం సాగుతున్న ముదిరాజ్ జాతి ఉద్యమానికి సంఘ సంస్కర్తగా ముదిరాజ్ జాతి ఉద్యమానికి మద్దతు ఇవ్వాలని కోరినట్లు తెలిపారు. ఎన్నికల సమయంలో

కామారెడ్డి డిక్లరేషన్ ఇచ్చిన హామీలు అమలు చేయడంలో విఫలమైనట్లు ఉద్యోగ సంఘాల కన్వీనర్ బాలకిషన్ ముదిరాజ్ విమర్శించారు. మాకు కులాలతో కొట్లాట లేదని,సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారం చేస్తు ముదిరాజ్ జాతి న్యాయమైన డిమాండ్ పక్కదారి పట్టించడం తెలంగాణ రాష్ట్రంలో జరుగుతుందని , ప్రభుత్వం దీనిని సాకుగా చూపిస్తూ ముదిరాజ్ జాతి కి ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదని మంద కృష్ణ దృష్టికి తీసుకెళ్లారు

*సామాజిక న్యాయానికి రాజ్యంగమే సాక్షి*…

రాజ్యాంగం ప్రకారం సామాజిక న్యాయమే అన్నీ జాతుల సమస్యలు పరిష్కారం కాగలవని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు పద్మశ్రీ మంద కృష్ణ మాదిగ స్పష్టం చేశారు.

తెలంగాణ రాష్ట్రంలో ని అట్టడుగు స్థాయిలో ఉన్న ముదిరాజ్ జాతి ఉద్యమం రాజ్యాంగ బద్ధమైన హక్కులు కల్పించాలని ప్రభుత్వం పై ఒత్తిడి చేస్తామని మంద కృష్ణ మాదిగ స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు డాక్టర్ బి విఠల్ ముదిరాజ్, ఉపాధ్యక్షులు తూర్పు రాజు ముదిరాజ్, ఉద్యోగుల సంఘం కన్వీనర్ బాలకిషన్ ముదిరాజ్ రామారెడ్డి మండల కార్యదర్శి ఆంజనేయులు ముదిరాజ్, ఆగం పాండు ముదిరాజ్, జలేందర్ ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు.

Akhand Bhoomi News

error: Content is protected !!