కామారెడ్డి జిల్లా దళిత సంఘం జిల్లా అధ్యక్షులు గా సబ్బని స్వామి…
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జూలై 11 (అఖండ భూమి న్యూస్):
బహుజన దళిత సంఘం ఆధ్వర్యంలో నూతన కమిటీ ఎన్నిక కామారెడ్డి జిల్లా కేంద్రంలో శనివారం రాష్ట్ర అధ్యక్షులు ఎర్ర శివరాజ్ ఆధ్వర్యంలో నూతన కమిటీ ఎన్నుకున్నారు. అనంతరము రాష్ట్ర నాయకులను ఎర్ర శివ రాజును శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ. కామారెడ్డిలో చురుకుగా పనిచేస్తున్నటువంటి సబ్బని స్వామిని కామారెడ్డి జిల్లా అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా నియమించారు. అందులో భాగంగా కామారెడ్డి జిల్లా అధ్యక్షులు సబ్బని స్వామి మాట్లాడుతూ. సంఘ సేవలకు నేను అందుబాటులో ఉంటానని సంఘం కు సహాయ సహకారాలు అందిస్తామంటూ ఆయన అన్నారు. ప్రతి విషయము నా దృష్టికి వచ్చినచో నేను నా వంతు కృషి చేస్తానని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో సంతోష్ ,రమేష్, రాజన్న తదితరులు పాల్గొన్నారు.
You may also like
సీ ఈ సీ రాజీనామాకు 48 గంటల గడువు… కాక్రోచ్ జనతా పార్టీ
రాజ్యాధికారం సాధన ద్వారా నే దళిత బహుజన కులాల కు విముక్తి ; దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి. కృష్ణ స్వరూప్
కాంగ్రెస్ ప్రభుత్వ 420 హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసింది…
రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలను ప్రారంభించిన జిల్లా అధ్యక్షుడు తీగల తిరుమల గౌడ్…
రైతుల అభ్యున్నతే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్…


