ప్రభుత్వ వృద్ధాశ్రమంలో వృద్ధులను పరామర్శించిన మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ గడ్డం ఇందుప్రియ…

కామారెడ్డి జిల్లా ప్రతినిధి;!జూలై 11 (అఖండ భూమి న్యూస్);
కామారెడ్డి పట్టణ కేంద్రంలోని ఇల్చిపూర్ రోడ్డులో ఓల్డ్ ఎస్ పి ఆర్ స్కూల్ వెనుక ఉన్న ప్రభుత్వ వృద్ధాశ్రమాన్ని మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ శ్రీమతి గడ్డం ఇందుప్రియ శనివారం సందర్శించారు. ఈ సందర్భంగా అక్కడ నివసిస్తున్న వృద్ధులతో ఆప్యాయంగా మాట్లాడి, వారి ఆరోగ్య పరిస్థితులు, దైనందిన జీవనం, ఇతర సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
వృద్ధుల యోగక్షేమాలను తెలుసుకుంటూ వారికి ధైర్యం చెప్పిన గడ్డం ఇందుప్రియ, సమాజంలో పెద్దలను గౌరవించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. వృద్ధులకు అవసరమైన సహాయ సహకారాలు అందేలా ప్రభుత్వం మరింత ప్రత్యేక దృష్టి సారించాలని అన్నారు.
అనంతరం ఆశ్రమంలోని వృద్ధులకు పండ్లను పంపిణీ చేసి, వారి ఆరోగ్యం బాగుండాలని ఆకాంక్షించారు. ఇలాంటి సేవా కార్యక్రమాలను భవిష్యత్తులో కూడా కొనసాగిస్తానని ఆమె తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఆశ్రమ సిబ్బంది,ఉన్నారు.
You may also like
సీ ఈ సీ రాజీనామాకు 48 గంటల గడువు… కాక్రోచ్ జనతా పార్టీ
రాజ్యాధికారం సాధన ద్వారా నే దళిత బహుజన కులాల కు విముక్తి ; దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి. కృష్ణ స్వరూప్
కాంగ్రెస్ ప్రభుత్వ 420 హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసింది…
రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలను ప్రారంభించిన జిల్లా అధ్యక్షుడు తీగల తిరుమల గౌడ్…
రైతుల అభ్యున్నతే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్…


