ఎల్లారెడ్డి బావ్ సార్ క్షత్రియ సమాజ్ అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తాం…
బావ్ సార్ క్షత్రియ సమాజ్ రాష్ట్ర అధ్యక్షులు ఉమేష్ జైతే ..
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జూలై 11 (అఖండ భూమి న్యూస్);
కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి డివిజన్ భావ్ సార్ క్షత్రియ సమాజ్ అభివృద్ధికి తన సహాయ సహకారాలు ఎప్పుడు వుంటాయని, బావ్ సార్ క్షత్రియ సమాజ్ రాష్ట్ర అధ్యక్షులు ఉమేష్ జైతే అన్నారు. శనివారం ఎల్లారెడ్డి డివిజన్ కేంద్రంలోని ఆ సంఘానికి రాష్ట్ర అధ్యక్షులు విలువైన మైక్ సెట్ బహుకరించారు. భావ్ సార్ క్షత్రియ సమాజం భవన ప్రారంభం రోజు రాష్ట్ర అధ్యక్షుడు ఇచ్చిన వాగ్దానం మేరకు ఆయనే స్వయంగా అట్టి మైక్ సెట్ ను తీసుకొచ్చి సంఘం ప్రతినిధులకు అప్పగించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో అయన మాట్లాడుతూ…క్షత్రియ సమాజ్ అభివృద్ధి, యువత ప్రగతి, విద్యా అవకాశాల విస్తరణ కోసం ఎల్లప్పుడూ తమ సహకారం కొనసాగుతుందన్నారు. సమాజం ఐక్యతతో ముందుకు సాగితే అన్ని రంగాల్లో అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు.
సమాజంలో విద్య, ఉపాధి, సామాజిక సేవా కార్యక్రమాలకు ప్రాధాన్యం ఇవ్వాలని, యువత సేవా దృక్పథంతో ముందుకు రావాలని ఉమేష్ జైతే పిలుపునిచ్చారు. భావ్ సార్ క్షత్రియ సమాజ్ సభ్యులందరూ ఐకమత్యంతో పనిచేస్తే సమాజ అభ్యున్నతి మరింత వేగవంతం అవుతుందని అన్నారు.
సమాజ సంక్షేమం కోసం చేపట్టే ప్రతి కార్యక్రమానికి తనవంతు సహకారం అందిస్తానని ఆయన స్పష్టం చేశారు. అనంతరం ఆ సంఘం ఎల్లారెడ్డి అధ్యక్షులు ఉక్కల్ కర్ రాజేందర్ నాథ్ మాట్లాడుతూ…క్షత్రియ సమాజం సామాజికంగా, విద్యాపరంగా, ఆర్థికంగా మరింత బలోపేతం కావడానికి ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు. యువత ఉన్నత విద్య, ఉపాధి, స్వయం ఉపాధి అవకాశాలను సద్వినియోగం చేసుకుని సమాజానికి ఆదర్శంగా నిలవాలని సూచించారు. తమ సంఘానికి మైక్ సెట్ బహుకరించిన రాష్ట్ర అధ్యక్షునికి కృతజ్ఞతలు తెలిపారు. హైదరాబాద్ లోని ఈసీఐఎల్ ప్రాంత సంఘం అధ్యక్షుడు కిషోర్ మాట్లాడుతూ. క్షత్రియ సమాజం సామాజికంగా, విద్యాపరంగా, ఆర్థికంగా మరింత బలోపేతం కావడానికి ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు. యువత ఉన్నత విద్య, ఉపాధి, స్వయం ఉపాధి అవకాశాలను సద్వినియోగం చేసుకుని సమాజానికి ఆదర్శంగా నిలవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో నారాయణ పేట జిల్లా నుండి వచ్చిన ప్రతినిదులు నారాయణరావు, ఘనటే సురేష్ కుమార్, హైదరాబాద్ ప్రతినిధి మహేందర్కర్ రమేష్,
స్థానిక ప్రతినిధులు అమృత్ రావు, అరవింద్, జాడే చంద్ర ప్రకాష్, వి. శ్రీనివాస్ రావు, నాగేష్, గోపాల్ రావు సంఘం సభ్యులు పాల్గొన్నారు.


