31న ఖర్చుక బిఈడి కళాశాలలో రౌండ్ టేబుల్ సమావేశానికి స్వచ్ఛందంగా తరలి రావాలి…

31న ఖర్చుక బిఈడి కళాశాలలో రౌండ్ టేబుల్ సమావేశానికి స్వచ్ఛందంగా తరలి రావాలి…

 

కామారెడ్డి జిల్లా ప్రతినిధి,; మే 28 (అఖండ భూమి న్యూస్);

కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఈ నెల 31న కర్షక బి.ఎడ్ కళాశాలలో నిర్వహించే రౌండ్ టేబుల్ సమావేశాన్ని విజయవంతం చేయాలని జల సాధన సమితి జిల్లా కన్వీనర్ వై. వెంకట్రాంరెడ్డి, ఫిరంగి రాజేశ్వర్, రవి లు అన్నారు. గురువారం దోమకొండ గ్రామపంచాయతీ ఆవరణలో ఏర్పాటుచేసిన సమావేశంలో ఈ సందర్భంగా మాట్లాడారు.
కామారెడ్డి ప్రాంతానికి గోదావరి జిల్లాలో తీసుకురావాలని ఉద్దేశంతో గత 20 సంవత్సరాలుగా మనం ప్రయత్నాలు చేస్తున్న గత రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం ప్రాణహిత చేవెళ్ల కార్యక్రమంలో భాగంగా సెవెంత్ లింకు కెనాల్ అని ప్రకటించి ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు కాలేశ్వరం ప్రాజెక్టు పేరును 21, 22 లింకు కెనాల్ ను మన ప్రాంతానికి గోదావరి తరలిస్తామని అప్పట్లో ప్రకటించారు. ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు దీనిపై దృష్టి కేంద్రీకరించకపోవడంతో ఈ ప్రాంత ప్రజలకు శాపంగా మారిందన్నారు. ఈ విషయంపై కామారెడ్డి సాధన సమితి తరపున రెండుసార్లు క్షేత్రస్థాయిలో పర్యటన జరిపి అధికారులకు వినతి పత్రం అందజేసినట్లు తెలిపారు. అయినప్పటికీ ఎలాంటి స్పందన లేదని ఆరోపించారు. దీనిపై ఈ ప్రాంత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ సలహాదారుడు మహమ్మద్ షబ్బీర్ కు విన్నపించి ఈ ప్రాంత ప్రజల చిరకాల కలని నిజం చేయడానికి కృషి చేయాలని కోరారు. ఈ విషయంపై జన సమీకరణతో షబ్బీర్ అని కలిసి విన్నపించాలని నిర్ణయించారు. ఈనెల 31న వచ్చే ఆదివారం కామారెడ్డి స్థానిక కర్షక బీఎడ్ కాలేజ్ రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈ ప్రాంత ప్రజల అభిప్రాయాలతో పాటు అన్ని రాజకీయ పార్టీల సలహాలు, సూచనలను తీసుకొని ముందుకు వెళుతున్నట్లు తెలిపారు. ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి ఈ ప్రాంత ప్రజలు, అన్ని రాజకీయ పార్టీలు ప్రతినిధులు, రైతులు, రైతు సంఘాలు, ఆయా గ్రామాల ప్రజలు, విద్యార్థి సంఘాలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఐరన్ నర్సయ్య, ఆశ బోయిన శ్రీనివాస్, బొమ్మర శ్రీనివాస్, అనంతరెడ్డి, పాలకుర్తి శేఖర్, రవి, గ్రామస్తులు పాల్గొన్నారు.

Akhand Bhoomi News

error: Content is protected !!