ముస్లిం సోదరులకు బక్రీద్ పండుగ శుభాకాంక్షలు తెలిపిన జిల్లా ఎస్పీ…

ముస్లిం సోదరులకు బక్రీద్ పండుగ శుభాకాంక్షలు తెలిపిన జిల్లా ఎస్పీ…

– యం. రాజేష్ చంద్ర,..

• ఈద్గా వద్ద భద్రతా ఏర్పాట్లను స్వయంగా పరిశీలించిన జిల్లా ఎస్పీ..

 

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; మే 28. (అఖండ భూమి న్యూస్);

బక్రీద్ పర్వదినాన్ని పురస్కరించుకొని కామారెడ్డి జిల్లా ముస్లిం సోదర సోదరీమణులకు, జిల్లా ప్రజలకు జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర శుభాకాంక్షలు తెలిపారు. ఈ పవిత్ర పండుగను ప్రజలందరూ శాంతి, సామరస్య వాతావరణంలో, ఆనందోత్సాహాల మధ్య జరుపుకోవాలని ఆయన ఆకాంక్షించారు.

పండుగ సందర్భంగా కామారెడ్డి పట్టణంలోని ఈద్గా వద్ద ఏర్పాటు చేసిన భద్రతా మరియు బందోబస్తు ఏర్పాట్లను జిల్లా ఎస్పీ స్వయంగా క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈద్గాకు ప్రార్థనల నిమిత్తం వచ్చే వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ట్రాఫిక్ నియంత్రణ, శాంతిభద్రతలు, మరియు పార్కింగ్ వసతులపై ప్రత్యేక దృష్టి సారించినట్లు ఆయన వెల్లడించారు.

జిల్లాలోని అన్ని ఈద్గాలు మరియు మసీదులలో బక్రీద్ ప్రత్యేక ప్రార్థనలు అత్యంత ప్రశాంత వాతావరణంలో, విజయవంతంగా ముగిశాయని ఎస్పీ తెలిపారు. పండుగ వేళ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీస్ అధికారులు, సిబ్బంది అత్యంత అప్రమత్తంగా ఉండి తమ విధులను సమర్థవంతంగా నిర్వహించారని పేర్కొన్నారు.

జిల్లాలోని ముఖ్య ప్రాంతాలు, ప్రార్థనా స్థలాల వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేయడంతో పాటు, నిరంతర పెట్రోలింగ్ (గస్తీ) కొనసాగించామని ఎస్పీ వివరించారు. ప్రజలు ఒకరికొకరు సహకరించుకుంటూ, సోదరభావంతో శాంతియుత వాతావరణంలో పండుగను జరుపుకోవడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేస్తూ, జిల్లా ప్రజలకు అభినందనలు తెలిపారు.

Akhand Bhoomi News

error: Content is protected !!