కొనుగోలు కేంద్రాలలో ముస్లిం సోదరులకు రవాణా చార్జీలు అందిస్తున్న కలెక్టర్…
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; మే 28 (అఖండ భూమి న్యూస్);
బక్రీద్ పండుగ సందర్భంగా కొనుగోలు కేంద్రాలలో రవాణా సేవలను అందిస్తున్న ముస్లిం సోదరులకు జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ దుస్తులు, నగదు ప్రోత్సాహకాలను అందజేశారు.
పండుగ సమయంలో కూడా వరి ధాన్యం రవాణా సేవలను నిరంతరాయంగా కొనసాగిస్తూ రైతులకు సహకరిస్తున్న డ్రైవర్ల సేవలను జిల్లా కలెక్టర్ ప్రశంసించారు. ముఖ్యంగా మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల నుంచి వచ్చిన డ్రైవర్ల సేవలను అభినందిస్తూ వారికి ప్రోత్సాహకాలు అందజేశారు.
ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖల అధికారులు, రవాణాదారులు, డ్రైవర్లు, మిల్ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.


