9మంది పేకాట రాయిల్లు అరెస్ట్
అసాంఘిక కార్యకలాపాలకు అడ్డగా ఆర్పి గార్డెన్
బెల్లంపల్లి మే 28(అఖండ భూమి న్యూస్):మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం కన్నాల గ్రామపంచాయతీలోని తిరుమల హిల్స్ ఆర్పి గార్డెన్ లో గురువారం పేకాట ఆడుతున్న పలువురిని అరెస్టు చేసినట్లు తాళ్ల గురజాల ఎస్ఐ బి.రామకృష్ణ తెలిపారు.ఎస్ఐ తెలిపిన వివరాల ప్రకారం పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆర్పి గార్డెన్లో పేకాట ఆడుతున్నారని విశ్వసినీయ సమాచారం మేరకు ఆకస్మిక దాడి నిర్వహించగా 9మంది వ్యక్తులు పేకాట ఆడుతు పట్టుబడినట్లు అయన తెలిపారు.గార్డెన్లో పేకాట ఆడుతున్న వ్యక్తులు జె.క్రాంతి కుమార్,డి.శ్రీనివాస్, ఎ.పోశం,తొంగల వెంకటేష్,గొడిశల మణిరాజ్,
గాజు గంగాధర్,సింగతి రవి,సలేందర్ కేశవ్,
ఎండి.హఫీజ్ అనే 9మందిని అరెస్టు చేసినట్లు అయన తెలిపారు.పేకాట రాయుళ్ల వద్ద నుండి 1లక్ష 28వేల240 రూపాయలు,8సెల్ ఫోన్ లు స్వాదినం చేసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.కాగా ఈ ఫంక్షన్ హాల్ పరిధిలో కొద్ది కాలంగ అసాంఘిక కార్యకలాపాలు ఉధృతంగా సాగుతున్నాయని పలువురు ఫిర్యాదులు చేసినట్లు సమాచారం.
పేకాట రాయుల్లతో పాటు ఇతర అసాంఘిక కార్యకలాపాలను కొనసాగించడానికి ఫంక్షన్ హాల్ యజమాని పూర్తి సహకారాలు ఉన్నట్లు ఆరోపణలు వ్యక్తం అవుతున్నాయి.ఎం జరగబోతుందో వేచి చూడాల్సిందే…
You may also like
సీ ఈ సీ రాజీనామాకు 48 గంటల గడువు… కాక్రోచ్ జనతా పార్టీ
రాజ్యాధికారం సాధన ద్వారా నే దళిత బహుజన కులాల కు విముక్తి ; దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి. కృష్ణ స్వరూప్
కాంగ్రెస్ ప్రభుత్వ 420 హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసింది…
రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలను ప్రారంభించిన జిల్లా అధ్యక్షుడు తీగల తిరుమల గౌడ్…
రైతుల అభ్యున్నతే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్…



