జిల్లా కలెక్టర్ ప్రజావాణిలో 93 దరఖాస్తుల స్వీకరణ…
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జూన్ 15 (అఖండ భూమి న్యూస్);
జిల్లా కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ పాల్గొని ప్రజల నుండి సోమవారం దరఖాస్తులను స్వీకరించారు.
ఈ సందర్భంగా మొత్తం 93 దరఖాస్తులు వచ్చాయని భూ సమస్యలు, సంక్షేమ పథకాలు, పెన్షన్లు, ఉపాధి, గృహాలు, రెవెన్యూ , ఇతర శాఖలకు సంబంధించిన వినతులు ప్రజలు సమర్పించారు.
అందిన ప్రతి దరఖాస్తును సంబంధిత శాఖల అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి, నిబంధనల మేరకు త్వరితగతిన పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ లు విక్టర్, ఎన్.వి గిరి, జెడ్పీ సీఈవో చందర్, జిల్లా అధికారులు పాల్గొన్నారు.
You may also like
కాంగ్రెస్ ప్రభుత్వ 420 హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసింది…
రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలను ప్రారంభించిన జిల్లా అధ్యక్షుడు తీగల తిరుమల గౌడ్…
రైతుల అభ్యున్నతే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్…
దోమకొండలో ఆడుదాం క్రీడా దినోత్సవ వేడుకలు…
యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో సన్మానాలు…


