అఖండ భూమి వెబ్ న్యూస్ :
YS Avinash Reddy: వైఎస్ వివేకా హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ అవినాష్ రెడ్డి (Ys Avinash Reddy)కి CBI మళ్లీ నోటీసులు జారీ చేసింది..
ఈనెల 22న విచారణకు రావాలని సీబీఐ అధికారులు ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. కాగా మొదట ఈనెల 16న విచారణకు రావాలని అవినాష్ రెడ్డి (Ys Avinash Reddy)కి సీబీఐ నోటీసులు ఇచ్చింది. అయితే ముందే ఫిక్స్ అయిన షెడ్యూల్ కారణంగా విచారణకు హాజరు కాలేనని..4 రోజుల సమయం ఇవ్వాలని సీబీఐకి లేఖ రాశారు. దీనితో ఈనెల 19న విచారణకు రావాలని సీబీఐ రెండోసారి నోటీసులు జారీ చేసింది..
అయితే తన తల్లికి అనారోగ్య కారణంగా విచారణకు రాలేనని రెండోసారి కూడా అవినాష్ (Ys Avinash Reddy) సీబీఐ విచారణకు డుమ్మా కొట్టారు. ఈ క్రమంలో సీబీఐ మూడోసారి నోటీసులు జారీ చేసింది. అయితే మొదటి రెండు సార్లు విచారణకు డుమ్మా కొట్టిన అవినాష్ (Ys Avinash Reddy) ఈసారైనా విచారణకు వస్తారా అనేది ఉత్కంఠ నెలకొంది. ఒకవేళ విచారణకు రాకపోతే సీబీఐ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారు? తప్పనిసరైతే అరెస్ట్ చేస్తారా? లేక కోర్టును ఆశ్రయిస్తారా? సీబీఐ ప్లాన్ ఏంటనేది ప్రస్తుతానికి సస్పెన్సే..