నెల్లూరు: నెల్లూరు డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ అనుచరుడు, వైకాపా విద్యార్థి నేత హాజీపై శుక్రవారం అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు..
ప్రస్తుతం హాజీ నెల్లూరులోని ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న హాజీని ఇవాళ రూప్‌కుమార్ యాదవ్ పరామర్శించారు. తన అనుచరుడిపై జరిగిన దాడిపై రూప్ కుమార్ యాదవ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
రూప్‌కుమార్ యాదవ్ మాట్లాడుతూ.. ”వైకాపా ఆవిర్భావం నుంచి హాజీ పార్టీలో ఉన్నారు. హాజీపై కత్తులతో హత్యాయత్నం చేశారు. కేవలం నాతో ఉన్నాడనే కక్షతోనే దాడి జరిగింది. బాధితుడు చెబుతున్నట్టు ఈ దాడి వెనుక స్థానిక ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ ఉన్నారు. ఇలాంటి దాడులు చేయడం మంచిది కాదు. గతంలోనూ నా అనుచరులపై దాడులు చేశారు. ఫిర్యాదు చేసిన వెంటనే పోలీసులు చర్యలు తీసుకొని ఉంటే ఇవాళ మరోసారి దాడి జరిగి ఉండేది కాదు. ఇకపై మా కార్యకర్తల జోలికి వస్తే సహించేది లేదు. నేను ప్రతీకారం మొదలుపెడితే ఊహకు కూడా అందదు. ఈ ఘటనను సీఎం జగన్, పార్టీ పెద్దల దృష్టికి తీసుకెళ్తా. నెల్లూరులో వైకాపాను సర్వనాశనం చేస్తున్నారు” అని రూప్‌కుమార్ యాదవ్ వ్యాఖ్యానించారు.
ఎమ్మెల్యే అనిల్‌కుమార్ యాదవ్ తీరుపై ఆయన బాబాయ్ (డిప్యూటీ మేయర్) రూప్ కుమార్ యాదవ్ పద్యం రూపంలో విమర్శలు గుప్పించారు. వేమన పద్యాన్ని ఉదహరిస్తూ తీవ్రస్థాయిలో మండిపడ్డారు..
You may also like
రాజ్యాధికారం సాధన ద్వారా నే దళిత బహుజన కులాల కు విముక్తి ; దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి. కృష్ణ స్వరూప్
కాంగ్రెస్ ప్రభుత్వ 420 హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసింది…
రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలను ప్రారంభించిన జిల్లా అధ్యక్షుడు తీగల తిరుమల గౌడ్…
రైతుల అభ్యున్నతే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్…
దోమకొండలో ఆడుదాం క్రీడా దినోత్సవ వేడుకలు…



