అయ్యప్ప స్వాముల అన్నదానానికి విరాళం….

వెల్దుర్తి నవంబర్ 5 (అఖండ భూమి న్యూస్) :
వెల్దుర్తి లోని జర్నలిస్టు కాలనీలో వెలిసిన అయ్యప్ప స్వామి ఆలయంలో జరుగుతున్న అన్నదాన కార్యక్రమానికి మండలంలోని బోయినపల్లి గ్రామ నాయకులు నర్సింగ్ అశోక్ రెడ్డి దంపతులు రూ. 5000 రూపాయల విరాళం అందించారు. బుధవారం కావడంతో అయ్యప్ప స్వామికి అభిషేకం చేశారు. అనంతరం మెట్ల పూజ కార్యక్రమాన్ని చేపట్టారు పడి వెలిగించి పాటలు పాడుతూ స్వామివారికి ప్రత్యేకంగా హారతులు ఇచ్చారు. ఈ సందర్భంగా విరాళం ఇవ్వడానికి వచ్చిన దంపతులకు ఆలయ ప్రధాన అర్చకుడు శ్రీధర్ శర్మ ప్రత్యేక పూజ నిర్వహించి తీర్థప్రసాదాలు అందించారు. అలాగే అభిషేకానికి వెల్దుర్తి పట్టణానికి చెందిన శ్రీరామమూర్తి సీతమ్మ వారి కుటుంబ సభ్యులు ఆర్థిక సహాయం చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు గోపీనాథ నాయుడు, మధు, చిరంజీవి, వెల్దుర్తి గ్రామ నాయకులు వెంకట నాయుడు, అయ్యప్ప స్వామి మాలధారణ స్వాములు పాల్గొన్నారు.


