బాల్యవివాహాల నిర్మూలన పై అవగాహన
(రేపల్లె నియోజకవర్గం ఇంచార్జ్: సిహెచ్ రాంబాబు. చెరుకుపల్లి, జనవరి 31, అఖండ భూమి న్యూస్ )బాల్య వివాహాలను అరికట్టడం సమాజంలోని మన అందరి బాధ్యత అని చెరుకుపల్లి శివాలయం ప్రధాన అర్చకులు రావూరి రఘునాధ శర్మ అన్నారు. శనివారం చెరుకుపల్లి గ్రామంలోని ఏడు అంగనవాడి కేంద్రాల ఆధ్వర్యంలో బాల్య వివాహాల నిర్మూలన పై అవగాహన ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో శివాలయం ప్రధాన అర్చకులు రఘునాధ శర్మ మాట్లాడుతూ బాల్య వివాహాల కారణంగా చిన్నతనంలోని ఆరోగ్యకరమైన సమస్యలతో పాటు మానసిక ఒత్తిడిలు కు గురవుతారని అన్నారు. తద్వారా పుట్టబోయే పిల్లలకు కూడా పలు రకాలే ఆరోగ్య, సమస్యలు ఉత్పన్నమవుతాయన్నారు. చిన్నతనంలో వివాహం ద్వారా కుటుంబ పరిస్థితులపై తగిన అవగాహన లేకపోవడం, ఒత్తిడి పరిస్థితులను తట్టుకోలేక తరచు మనస్పర్ధలు చోటుచేసుకుని భార్యాభర్తలు విడిపోవడానికి మరియు కుటుంబం విచ్ఛిన్నం అవటానికి దారి తీస్తుందని స్థానిక చర్చి పాస్టర్ ముప్పాల నిరీక్షణ రావు అన్నారు. ఆయన స్థానికులకు వివరించారు. అంతేకాకుండా బాల్య వివాహాలు చట్టరీత్యా నేరమని అటువంటి చర్యలకు ఎవరైనా పాల్పడితే వాటిని ఖండించడమే కాకుండా స్థానికులు తక్షణమే అంగనవాడి ,పోలీస్, సంబంధిత శాఖలకు తెలియపరచడం ద్వారా వాటిని త్వరితగతిన నిర్మూలించవచ్చునని అంగన్వాడి కార్యకర్తలు స్థానికులకు సూచించారు. కార్యక్రమంలో ఆలయ అభివృద్ధి కమిటీ చైర్మన్ అన్నపురెడ్డి సాంబశివరావు, మల్లేశ్వరి, సిహెచ్ వెంకటేశ్వరమ్మ ,బి శైలజ, జి లక్ష్మీ తిరుపతమ్మ, జి నాగమణి, పి నిర్మలాదేవి, జి లెనినా , ఆశా కార్యకర్తలు ,స్థానికులు, తదితరులు పాల్గొన్నారు.
You may also like
దత్తత గ్రామం అల్లిపూడి అభివృద్ధికి యనమల దివ్య భరోసా: సమస్యల పరిష్కారానికి హామీల జల్లు
రాజమహేంద్రవరం అభివృద్ధిపై శ్వేత పత్రం విడుదల చేయాలి
అంగరంగ వైభవంగా “మేడా” జన్మదిన వేడుకలు జరిగాయి …
రాజమండ్రిలో ఎనిమిదవ, బ్రాంచ్ ప్రారంభo
కుల నిర్మూలనకు, మహిళా సాధికారత కోసం పూలే సేవలు మరువలేనివి సున్నిపెంట గ్రామ అధ్యక్షుడు సుభాన్



