దోమకొండ భక్తిశ్రద్ధలతో ఊర పండగ ఉత్సవాలు..!
అంగరంగ వైభవంగా ఐదు రోజుల పండగ..
మూడవ రోజుకు చేరుకున్న దోమకొండ ఊర పండగ..
దోమకొండలో రంగం ఎక్కిరా రంగసాని..
దోమకొండలో కిక్కిరిసిన జనంతో కిటకిటలాడిన బురుజు ప్రాంతం..
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; ఫిబ్రవరి 1 (అఖండ భూమి న్యూస్);
కామారెడ్డి జిల్లా దోమకొండ మండల కేంద్రంలో ఈ నెల 30న ప్రారంభమైన దోమకొండ ఊర పండగ ఐదు రోజుల పండగ జన జాతర భక్తులతో ఆదివారం కిటకిటలాడాయి. అంగరంగ వైభవంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. దోమకొండ కుల సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించే ఐదు రోజుల ఊరపండగ కు చుట్టుముట్టు ప్రాంతాల వారు తండోపతండాలుగా హాజరై అమ్మవార్లకు మొక్కులు చెల్లిస్తున్నారు. గ్రామంలోని చరిత్ర కలిగిన దోమకొండ బుర్జుకోట తో పాటు ఊరడమ్మ, ముత్యాలమ్మ, నల్ల పోచమ్మ, అగ్రహారం పోచమ్మ, , పెద్దమ్మ, దుర్గమ్మ , కట్ట మైసమ్మ ల ఆలయాల వద్ద భక్తుల రద్దీతో కిటకిటలాడాయి. ఆలయాల వద్ద , బురుజు ప్రాంతంలో ఐదు రోజులు నిర్వహించే ఊర పండగకు ప్రత్యేక ఏర్పాట్లు, సౌకర్యాలు కల్పించారు. స్థానిక బుర్జు కోట వద్ద రంగసానితో రంగమెక్కించి భవిష్యవాణి వినిపించారు. గ్రామ పొలిమేరలో సరుగుచాల్లారు. అనంతరం గ్రామదేవతలకు పూజలు నిర్వహించి గ్రామ పొలిమేరల వన భోజనాలకు తరలి వెళ్లారు. డప్పు వాయిద్యాలతో పాటు పోతరాజుల విన్యాసాలు, శివసత్తుల నాటి నృత్యములతో అంగరంగ వైభవంగా కనులవిందుగా కార్యక్రమాలు చేపట్టారు. మొత్తానికి దోమకొండలో జాతర తలపిస్తుంది. ఫిబ్రవరి , 2న ఊరడమ్మకు చేయడం, 3న కట్ట మైసమ్మ కు చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఐరన్ నరసయ్య, దోమకొండ పంచాయతీ పాలకవర్గం సభ్యులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
You may also like
ప్రచారంలో దూసుకుపోతున్న కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి పార్సి సరిత ధనంజయ్..!
ప్రచారంలో ముందంజ కాంగ్రెస్ అభ్యర్థి మెట్టు స్నేహ , మామిండ్ల రామ్ కిషోర్.
బాల సంరక్షక్ భవనాన్ని క్షేత్ర పర్యటనలో సౌత్ క్యాంపస్ విశ్వవిద్యాలయం విద్యార్థులు…
అనుభవాల పాఠం వృద్ధాప్యం
ముత్యంపేటలో వాడవాడలా ఎల్లమ్మకు బోనాలు ఊరేగింపు…


